కన్నీళ్లు పెట్టిస్తున్న జబర్దస్త్ నరేష్ లవ్ స్టోరీ.. ఆ లోపం వల్ల?

జబర్దస్త్ స్టేజ్ పైకి నవ్వుతూ నవ్విస్తూ కనిపించే ఆర్టిస్టుల నవ్వు వెనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధాకరమైన గతాలు ఉన్నాయి.ఇప్పటికే పలువురు కమెడియన్లు వారి గతంలో జరిగిన విషయాలను పంచుకున్న విషయం తెలిసిందే.

 Jabardasth Comedian Naresh Love Story Is Emotional , Jabardasth , Potti Naresh ,-TeluguStop.com

అలా కష్టాలను ఎదుర్కొన్న వారిలో జబర్దస్త్ కమెడియన్ పుట్టిన రోజు కూడా ఒకరు.జబర్దస్త్ ద్వారా నరేష్ ఎంత పాపులారిటీ సంపాదించుకున్నాడు మనందరికీ తెలిసిందే.

అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీలో చేస్తూ అప్పుడప్పుడు ఈవెంట్లలో కూడా పాల్గొంటూ ఉంటాడు నరేష్.ఇది ఇలా ఉంటే శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల అయింది.

ఆ ప్రోమోలో నరేష్ ఒక ఎమోషనల్ స్కిట్ చేశాడు.తన లైఫ్ లో లవ్ స్టోరీ ని స్కిట్ రూపంలో ప్రదర్శించాడు నరేష్.నరేష్ చేసిన స్కిట్లో ఒక ఈవెంట్ లో డాన్స్ చేస్తూ ఉండగా అతడి డాన్స్ ఫిదా అయినా ఒక అమ్మాయి ఇంప్రెస్ అవుతుంది.ఆ తర్వాత ఆ అమ్మాయి నరేష్ ఇద్దరు ప్రేమలో పడతారు.

అనంతరం నరేష్ అమ్మాయితో రొమాంటిక్ డాన్స్ కూడా చేస్తాడు.కానీ ఆ అమ్మాయి తన అసలైన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడటం నరేష్ సీక్రెట్ గా గమనిస్తాడు.

అప్పుడు ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఇంకా ఆ పొట్టి వాడితోనే తిరుగుతున్నావా అని అనగా వెంటనే ఆ అమ్మాయి అలా కాదు అభి ఆ పొట్టోడు ఈవెంట్స్ లో సంపాదించిన డబ్బు మొత్తం తీసుకుని వాడుకుని వదిలేద్దాం అని అంటుంది.

Telugu Jabardasth, Love, Potti Naresh-Movie

అయితే ప్రేమ పేరుతో మోసం చేయడంతో పాటు తన లోపాన్ని షీలను చేసి మాట్లాడడంతో నరేష్ గుండె పగిలే విధంగా ఏడుస్తాడు.అలా నరేష్ ఎమోషనల్ గా ప్రతి ఒక్కరికి కన్నీళ్లు తెప్పిస్తాడు.ఇక నరేష్ చేసిన పర్ఫామెన్స్ కి హీరోయిన్ సదా కూడా ఫిదా అవుతుంది.

ఆ తర్వాత పర్ఫామెన్స్ అయిపోయిన తర్వాత అందరూ కలిసి నరేష్ ని ప్రశంసిస్తారు.అప్పుడు సదా ప్రశంసిస్తూ మీ లైఫ్ లో కూడా ఇలా జరిగిందా అని అడగగా ఉంది మేడం అని అంటాడు.

బాగా ఇప్పటికే చాలా సార్లు తన లోపాన్ని చాలామంది హేళన చేస్తున్నారు అన్న విషయాన్ని జబర్దస్త్ లో పలు స్కిట్ ల ద్వారా ఇన్ డైరెక్ట్ గా చెప్పిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube