కపుల్స్ కి బిగ్ షాక్ ఇచ్చిన బిగ్ బాస్.. ట్విస్ట్ అదిరింది!

బుల్లితెర కార్యక్రమాలలో అతిపెద్ద రియాలిటీ షో గా ప్రసారమవుతున్నటువంటి బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో ఆరవ సీజన్ ప్రసారమవుతుంది.ఇక ఈ కార్యక్రమంలో ఏకంగా 21 మంది కంటెస్టెంట్ లో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.

 Bigg Boss Gave A Big Shock To The Couples There Is A Twist , Bigg Boss,big Shock-TeluguStop.com

ఇందులో మెరీనా, రోహిత్ కపుల్స్ ఉన్న సంగతి మనకు తెలిసిందే.సీజన్ ఫోర్లో ఇలా హీరో వరుణ్ సందేశ్ వితిక జంటను హౌస్ లోకి పంపించిన బిగ్ బాస్ తాజాగా సీజన్ సిక్స్ లో మరోసారి సెలబ్రెటీ కపుల్స్ ను హౌస్ లోకి కంటెస్టెంట్ గా పంపించారు.

ఇకపోతే మొదటి వారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తి అయ్యాయి.ఈ క్రమంలోనే నామినేషన్స్ లో ఎన్నో ట్విస్ట్ లు ఇచ్చిన బిగ్ బాస్ మెరీనా రోహిత్ విషయంలో కూడా అలాంటి ట్విస్ట్ ఇచ్చారు.

ఈ క్రమంలోనే రోహిత్ మెరీనా కంటెస్టెంట్లను ఇద్దరిగా కాకుండా ఒకరిగానే భావించాలని బిగ్ బాస్ సూచించారు.వీరిద్దరిలో ఎవరు ఒకరు నామినేట్ అయిన ఇద్దరు నామినేషన్ లో ఉన్నట్టేనని బిగ్ బాస్ వెల్లడించారు.

ఇక బిగ్ బాస్ సూచన ప్రకారం వీరిద్దరిలో ఒకరు నామినేషన్ లో ఉండి ఒకరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయితే ఇద్దరు వెళ్లాల్సి ఉంటుందని చెప్పకనే చెప్పారు.

Telugu Big Shock, Bigg Boss, Chalaki Chanti, Faima, Marina, Revanth, Rohit, Varu

ఏది ఏమైనా బిగ్ బాస్ ఈ జంటకు భారీ షాక్ ఇచ్చిందని చెప్పాలి.ఇకపోతే ఈ వారం నామినేషన్ లో భాగంగా ఈ ఇద్దరు నామినేషన్స్ లో లేకపోవడం గమనార్హం.ఇక ఈ వారంలో ఏడుగురు కంటెస్టెంట్లు నామినేషన్ లో ఉండగా చలాకి చంటి, రేవంత్, ఫైమా సేఫ్ జోన్ లో ఉన్నారని తెలుస్తోంది.

మిగిలిన కంటెస్టెంట్స్ అభినయశ్రీ, సత్య శ్రీ, ఆరోహి, ఇనయ సుల్తానా ఈ నలుగురిలో తప్పకుండా ఒకరు బయటకు వస్తారని ప్రచారం జరుగుతుంది.మరి ఈ నలుగురిలో ఎవరు మొదటి వారం ఎలిమినేట్ అవుతారో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube