ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది.సీఎం జగన్ అధ్యక్షతన సాగిన ఈ భేటీలో 57 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం చెప్పింది.భావనపాడు పోర్టు విస్తరణ, గ్రీన్ ఎనర్జీలో రూ.81 వేల కోట్ల పెట్టుబడులు, 21 వేల ఉద్యోగాలు కల్పించే పెట్టుబడులతో పాటు వైఎస్ఆర్ చేయూతను కేబినెట్ ఆమోదించింది.
సచివాలయంలో 85 అదనపు పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యను సీఎం జగన్ పరిష్కరించారు.దీంతో సచివాలయంలోని ఉద్యోగులు కేబినెట్ నిర్ణయం పట్ల ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.







