నందమూరి ఫ్యామిలీ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు గత రెండు మూడు సంవత్సరాలుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ. ఆయన గత కొంత కాలంగా నటన లో శిక్షణ పొందుతున్నాడని, తప్పకుండా సినిమాల్లో నటిస్తాడు.
అందుకు మోక్షజ్ఞ సిద్ధంగా ఉన్నాడు అంటూ బాలకృష్ణ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.గత ఏడాది ఒక మీడియా సమావేశంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ తప్పకుండా మోక్షజ్ఞ హీరోగా సినిమాల్లో ఎంట్రీ ఇస్తాడని.
కానీ కాస్త సమయం కావాలి అంటూ పేర్కొన్నాడు.ఇప్పటికే బాలకృష్ణ వద్ద పలు కథలు మోక్షజ్ఞ కోసం రెడీగా ఉన్నాయి.
ఎంతో మంది దర్శకులు మరియు రచయితలు మోక్షజ్ఞ కోసం రాసిన కథలను నందమూరి బాలకృష్ణ తన వద్ద పెట్టుకున్నాడు.అతి త్వరలోనే ఆ కథ లో ఒక కథ ను ఎంపిక చేసి మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే అవకాశాలు ఉన్నాయని అంతా భావిస్తున్నారు.
మోక్షజ్ఞ యొక్క పుట్టిన రోజులు ఎన్నో పోతున్నాయి.కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క పుట్టిన రోజుకు కూడా మోక్షజ్ఞ సినిమా అంటూ ప్రకటన రాలేదు.నేడు మళ్లీ మోక్షజ్ఞ పుట్టిన రోజు వచ్చింది.ఈ సందర్భంగా ఆయన మొదటి సినిమా ప్రకటన వస్తుందంటూ నందమూరి అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.

కానీ ఈసారి కూడా అభిమానులకు నిరాశే మిగిలింది.మోక్షజ్ఞ ఎంట్రీ ఈ సంవత్సరం కూడా లేదని దాదాపుగా కన్ఫర్మ్ అయింది.2023లో అయినా ఈయన హీరోగా ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి.బాలకృష్ణ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నాడు.
తన కొడుకు మోక్షజ్ఞ పై ఆయన ఫోకస్ పెట్టట్లేదేమో అంటూ నందమూరి అభిమానులు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.వచ్చే ఏడాదిలో అయినా మోక్షజ్ఞని సినిమాల్లో నటింప చేయాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు.








