ఏనుగులు ఎప్పుడూ గుంపుగానే వెళ్తుంటాయి.ఈ గుంపులో దేనికైనా అపాయం వస్తే మిగతా ఏనుగులన్నీ కలిసి దానికి సహాయం చేస్తాయి.
ఇక తల్లి ఏనుగులు తమ పిల్ల ఏనుగులను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాయి.ఎక్కడికి వెళ్ళినా అవి తమ పిల్ల ఏనుగుల వెంటే వెళ్తాయి.
చిన్న ఏనుగు పిల్లలకు ఎక్కడ ప్రమాదం పొంచి ఉందో తెలియదు కాబట్టి అవి తమ ఇష్టానుసారం తిరుగుతూ ఉంటాయి.ఆ సమయంలో వీటిని పెద్ద ఏనుగులు కాపాడుతూనే ఉంటాయి.
అయితే తాజాగా ఒక తల్లి ఏనుగు తన పిల్ల ఏనుగును నేషనల్ పార్క్‌లో టూరిస్టుల వద్దకు వెళ్లకుండా రక్షించింది.
ట్విటర్ హ్యాండిల్ బ్యూటెంగేబిడెన్ ఈ వీడియో క్లిప్‌ను షేర్ చేస్తూ.“తల్లి ఏనుగు తన పిల్లను టూరిస్ట్స్ వద్దకు వెళ్లకుండా ఆపుతుంది” అనే క్యాప్షన్ యాడ్ చేసింది.ఇక ఈ వైరల్ వీడియో ఓపెన్ చేస్తే మనకు తల్లి ఏనుగు తన పిల్లను పర్యాటకుల దగ్గరికి వెళ్లకుండా ఆపివేయడాన్ని గమనించవచ్చు.
ఈ దృశ్యం అపరిచితులతో మాట్లాడకూడదని తన పిల్లకు ఆ తల్లి ఏనుగు చెబుతున్నట్లుగా కనిపించింది.వీడియో మొదట్లో తల్లి ఏనుగు, పిల్ల ఏనుగు రోడ్డు దాటుతున్నట్లు కనిపించింది.
అయితే, పిల్ల ఏనుగు ఆ రోడ్డుపైనే ఆగి ఉన్న పర్యాటకులను గమనించింది.అనంతరం వారి వైపు వెళ్లడం ప్రారంభించింది.

దీన్ని గమనించిన తల్లి ఏనుగు వెంటనే అప్రమత్తం అయ్యింది.ఆ ఏనుగు తన పెద్ద తొండంతో సందర్శకుల నుంచి పిల్ల ఏనుగును దూరంగా లాగి రక్షించింది.అలానే తన బిడ్డ దగ్గరికి ఎవరు రావద్దనట్లుగా టూరిస్టులను కూడా అది హెచ్చరించింది.ఈ వీడియో నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది.“జంతువులు మూగవి అయినా, మాట్లాడలేకపోయినా.తమ కుటుంబంతో చాలా సమర్థవంతంగా కమ్యూనికేట్ అవుతాయి.
ఏనుగులు తమ పిల్లలను కాపాడుతూ ఎప్పుడూ తమ గొప్ప తల్లి ప్రేమను చాటుకున్నాయి” అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.షేర్ చేసిన సమయం నుంచి ఈ వీడియో 1.5 మిలియన్లకు పైగా వ్యూస్, 77 వేల కంటే ఎక్కువ లైక్స్‌ను పొందింది.







