బాలీవుడ్ యాక్షన్ హీరో సల్మాన్ ఖాన్ ఫస్ట్ టైం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ పాత్ర తెలుగు ఆడియెన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు.
ఇక అలానే మన టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేష్ కూడా సల్మాన్ ఖాన్ నటిస్తున్న సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు.బాలీవుడ్ స్టార్ డైరక్టర్ ఫార్హాద్ సాంజి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ముందు కబి ఈద్ కబి దివాలి టైటిల్ ని ఫిక్స్ చేశారు.
అయితే ఆ తర్వాత సినిమాకి భాయిజాన్ అనే టైటిల్ కూడా పరిశీలించారు.కానీ ఫైనల్ గా ఈ సినిమాకు కిసీ కా భాయ్ కిసీ కి జాన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారట.
సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది.టాలీవుడ్ లో ఓ రేంజ్ ఫాం లో ఉన్న పూజా హెగ్దే బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తుంది.
సల్మాన్ ఖాన్ సినిమాతో అమ్మడు అక్కడ కూడా తన సత్తా చాటాలని చూస్తుంది. వెంకటేష్, సల్మాన్ స్క్రీన్ షేరింగ్ పై బాలీవుడ్ లోనే కాదు తెలుగు ఆడియెన్స్ లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.







