యువ హీరో శర్వానంద్ ఈ శుక్రవారం ఒకే ఒక జీవితం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.శ్రీ కార్తీక్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతుంది.
వరుస ఫ్లాపులతో డీలా పడ్డ శర్వానంద్ ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు.ఇక ఈ సినిమా రిలీజ్ కు మరో నాలుగు రోజులు ఉందనగా శర్వానంద్ మరో సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకున్నారు.
శర్వానంద్ హీరోగా కృష్ణ చైతన్య డైరక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు.
ఈ సినిమా పూజా కార్యక్రమాలు నేడు జరిగాయి.శర్వానంద్ సరసన రాశి ఖన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.పూజ అనంతరం హీరో, హీరోయిన్ మీద క్లాప్ కొట్టారు ప్రముఖ స్టార్ డైరక్టర్ త్రివిక్రం శ్రీనివాస్.సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా శర్వానంద్ వరుసగా మూవీస్ చేస్తూ వెళ్తున్నాడు.
ఈ కొత్త సినిమా గోదావరి బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతుందని తెలుస్తుంది. సినిమా మొత్తం అక్కడే షూటింగ్ నిర్వహిస్తారని తెలుస్తుంది.
ఆల్రెడీ శర్వానంద్ శతమానం భవతి కూడా గోదావరి జిల్లాల నేపథ్యంతోనే తెరకెక్కించారు.







