పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ డైరక్షన్ లో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నారు.దీనితో పాటుగా తమిళ హిట్ మూవీ వినోదయ సీతం రీమేక్ లో కూడా నటిస్తారని టాక్.
ఈ సినిమాతో పాటుగా హరీష్ శంకర్ సినిమా కూడా లైన్ లో ఉంది.ఇక ఈ సినిమాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో యంగ్ డైరక్టర్ తో సినిమాకి రెడీ అయినట్టు తెలుస్తుంది.
రన్ రాజా రన్ సినిమాతో సత్తా చాటిన యువ దర్శకుడు సుజిత్ తన నెక్స్ట్ సినిమానే బాహుబలి ప్రభాస్ తో సాహో సినిమా చేశాడు.ఆ సినిమా హిందీలో హిట్ అయినా తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో వర్క్ అవుట్ కాలేదు.
కొన్నాళ్లుగా తన నెక్స్ట్ సినిమా ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న సుజిత్ ఫైనల్ గా పవన్ కళ్యాణ్ ఆఫర్ అందుకున్నాడని టాక్.సుజిత్ చెప్పిన కథ నచ్చడంతో పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే సుజిత్ మరో లక్కీ ఛాన్స్ అందుకున్నట్టే లెక్క.స్టైలిష్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న సుజిత్ పవన్ తో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.
మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ రీమేక్ ఛాన్స్ మిస్సైన సుజిత్ పవన్ తో సినిమా ఫిక్స్ చేసుకోవడం లక్కీ అని చెప్పొచ్చు.