ఘోర ప్రమాదం: 40 అడుగుల ఎత్తు జారిపోయిన జెయింట్‌ వీల్.. ముగ్గురి పరిస్థితి విషమం!

మనకి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడం కష్టమే.ప్రమాదం అనేది ఏ రూపంలో నుండైనా రావొచ్చు.

 Fatal Accident Giant Wheel That Slipped 40 Feet High Three People Are In Critica-TeluguStop.com

అయితే మనం అప్రమత్తంగా ఉండటం అనేది మన బాధ్యతే.నిత్యం మన చుట్టూ అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటాయి.

అలాంటి ప్రమాదమే పంజాబ్‌లోని ఓ ఎగ్జిబిషన్‌లో చోటుచేసుకుంది.అక్కడికి వెళ్లిన ఔత్సాహికులు కొందరు తమ పిల్లలను పట్టుకొని జెయింట్‌ స్వింగ్‌ ఎక్కారు.

ఆ జెయింట్‌ స్వింగ్‌ అటుఇటు కదలడంతో పిల్లలు కేరింతలు కొట్టడం మొదలు పెట్టారు.పెద్దవాళ్ళైతే గాల్లో తేలిపోతూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.

ఇంతలో అనూహ్య పరిణామం.

ఉన్నట్లుండి జెయింట్‌ స్వింగ్‌ కిందికి జారి పడింది.

దాదాపు 40 అడుగుల నుంచి జెయింట్‌ స్వింగ్‌ కిందపడడంతో సుమారు 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి.వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

కాగా ప్రమాద సమయంలో జెయింట్‌ స్వింగ్‌లో 50 మందికి పైగా ఉన్నట్టు భోగట్టా.ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన పంజాబ్‌లోని మొహాలి నగరంలో చోటు చేసుకుంది.

జెయింట్‌ స్వింగ్‌ గాల్లో ఉండగానే ఫెయిల్‌ అయ్యింది.దీంతో ఒక్కసారిగా 40 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయింది ఈ జెయింట్‌ స్వింగ్‌ .దీంతో అందులో ఎక్కిన వారు గాయాలపాలయ్యారు.

చాలామందికి వెన్నుపూస ఇరిగినట్లు సమాచారం.

ప్రమాద సమయంలో స్వింగ్‌పై మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉన్నారు.కాగా ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు బాధితులను ఆస్పత్రులకు చేర్చారు.

సకాలంలో చికిత్స అందించారు.కాగా ఘటన విషయంలో ఎగ్జిబిషన్‌ ఓనర్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు.

ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదని.గాయాలపాలైన వారికి చికిత్స జరుగుతోందని తెలిపారు పోలీసులు.

ఇదిలా ఉంటే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube