వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ హీరోహీరోయిన్లుగా నటించిన రంగ రంగ వైభవంగా సినిమా శుక్రవారం రోజున థియేటర్లలో విడుదలైంది.మార్నింగ్ షో నుంచి నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్లు అంతకంతకూ తగ్గుతుండటంతో నిర్మాతలకు భారీ నష్టాలు ఖాయమని తేలిపోయింది.
ఈ సినిమా రెండు రోజుల కలెక్షన్లు రెండు కోట్ల రూపాయల కంటే తక్కువ మొత్తమంటే ఈ సినిమా రేంజ్ ఏంటో సులువుగా అర్థమవుతుంది.
అయితే ఈ సినిమా ఊహించని స్థాయిలో డిజాస్టర్ కావడానికి చాలా కారణాలున్నాయి.
ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో బోర్ కొట్టించిన సినిమా రంగ రంగ వైభవంగా మాత్రమేనని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.వైష్ణవ్ తేజ్ తనకు సూట్ కాని పాత్రను ఎంపిక చేసుకున్నాడని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
వైష్ణవ్ భిన్నమైన కథలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని మరి కొందరు చెబుతున్నారు.

అనుభవం లేని డైరెక్టర్ డీల్ చేయడం కూడా రంగ రంగ వైభవంగా ఫ్లాప్ కు మరో కారణమని కామెంట్లు వినిపిస్తున్నాయి.డైరెక్టర్ గిరీశాయ ఏ మాత్రం ఆసక్తిగా అనిపించని కథ, కథనాలతో ఈ సినిమాను తెరకెక్కించారని కొత్తదనం ఈ సినిమాలో ఏ మాత్రం కనిపించలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ సినిమా ఫలితం మెగా ఫ్యాన్స్ ను కూడా ఎంతగానో బాధ పెడుతుండటం గమనార్హం.
రంగ రంగ వైభవంగా ఫుల్ రన్ లో 4 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించడం కూడా కష్టమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.నవ్యత ఉన్న కథలపై దృష్టి పెట్టని పక్షంలో వైష్ణవ్ తేజ్ సినీ కెరీర్ ప్రమాదంలో పడుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
వైష్ణవ్ తేజ్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.







