సాధారణంగా చేపలు నీటిలోనే ఉండగలవు.అవి మరెక్కడా కూడా ఎక్కువసేపు ప్రాణాలతో ఉండలేవు కానీ తాజాగా కొన్ని చేపలు మబ్బుల్లో ఈత కొడుతూ కనిపించాయి.
అయితే ఇవి నిజంగానే ఆకాశంలో ఈత కొట్ట లేదు.కానీ ఒక ఫోటో గ్రాఫర్ చేపలు ఆకాశంలో తేలియాడుతూ ఈత కొడుతూ ఉన్నట్లుగా భ్రమ కలిగించేలా ఒక ఫొటో తీశాడు.
దాంతో నీటిలోని చేపలు ఆకాశంలోని మబ్బుల మధ్య ఎగురుతూ ఉన్నట్లు కనిపించింది.ఈ ఫొటోని ఫిన్లాండ్ దేశానికి చెందిన ఫోటోగ్రాఫర్ టీనా ఒక సరస్సులో క్లిక్ మనిపించారు.
నీటి అడుగున ఉన్న ఓ వండర్‌ల్యాండ్ అని ఈ ఫొటోని అందరూ అభివర్ణిస్తున్నారు. ‘వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్’ వంటి ప్రతిష్టాత్మక పోటీల్లో ఇది ఇప్పటికే నామినేట్ అయ్యింది.
వివిధ విభాగాల్లో బెస్ట్ ఫొటోగ్రాఫర్ ఎవరనేది అక్టోబర్ 11న ప్రకటించనుండగా… ఈ ఫోటోకి కచ్చితంగా తగిన గుర్తింపు దక్కుతుందని తెలుస్తోంది.ఈ ఫొటోలో మేఘాల్లా కనిపిస్తున్నది ఒక రకమైన నాచు అని ఆ ఫొటో గ్రాఫర్ తెలిపారు.
ఇక మరోచోట చేపల గుంపును మరో ఫొటోగ్రాఫర్ ఫొటో తీశారు.

మొదట చిత్రంలో చేపలు ఆకాశంలో తేలియాడుతున్నట్లు కనిపించగా.రెండో ఫొటోలో మాత్రం ఏదో స్మశానాల దిబ్బలాగా చేపల గుంపు కనిపించింది.ఈ పిక్చర్‌ను ఏపీలోని కాకినాడ జిల్లా వాసి అయిన మన్నెపురి శ్రీకాంత్ క్లిక్ చేశారు.
వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ పోటీల బరిలోకి ఈ ఫోటో కూడా దిగింది.ఒకేచోట ఇన్ని పెద్ద చేపలు గుమిగూడటం, అవి చూసేందుకు అద్భుతం గా కనిపించడం ఈ ఫోటోలోని ప్రత్యేకత.
కాకినాడ ఫిష్ మార్కెట్‌లో చేపలు ఎంత పెద్ద గా, ఎంత సంఖ్యలో ఉంటాయో చెప్పేందుకే ఆయన డ్రోన్ ద్వారా ఈ చిత్రాన్ని తీశారు.దీనికి ‘వన్‌డే క్యాచ్’ అని పేరు పెట్టారు.







