ఈనెల 5 నుంచి ఉచిత చేప పిల్లలను పంపిణీని ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.ఈ నేపథ్యంలో 26 వేల 778 నీటి వనరుల్లో 68 కోట్ల చేప పిల్లలను విడుదల చేస్తామన్నారు.
జనగామ జిల్లాలోని ఘన్ఫూర్ రిజర్వాయర్ లో చేప పిల్లలను పంపిణీ చేస్తామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కోరారు.







