బాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం బ్రహ్మాస్త్ర వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం పలు సార్లు చిత్ర యూనిట్ సభ్యులు హైదరాబాద్ వచ్చారు.
చివరి సారిగా నిన్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం చిత్ర యూనిట్ సభ్యులు ప్రత్యేక విమానంలో ముంబై నుండి హైదరాబాద్ చేరుకున్నారు.రామోజీ ఫిలిం సిటీ లో నిర్వహించాల్సిన భారీ ఈవెంట్ కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయింది అంటూ అధికారిక ప్రకటన వచ్చింది.
ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిన వెంటనే హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్లో పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ ని చిత్ర సభ్యులు నిర్వహించారు.ఎలాగైతే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్స్ మాట్లాడాలి అనుకున్నారో అలాగే ప్రెస్ మీట్ లో మాట్లాడేశారు.
ఆలియా భట్ మరియు రణబీర్ కపూర్ పాల్గొన్న ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు అయిన విషయం తెలిసిందే.ఇక ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ ఎన్టీఆర్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అయితే మరో రెండు ప్రత్యేక అంశాలు ఇక్కడ ఉన్నాయి.అవి ఏంటి అంటే రణబీర్ కపూర్ తెలుగులో మాట్లాడాడు.
తెలుగు లో చాలా చక్కగా మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకర్షించాడు.ఇక ఆలియా తెలుగులో మాట్లాడడమే గగనం అనుకుంటే ఆమె తెలుగులో మాట్లాడటం తో పాటు తెలుగు పాట ను చాలా సింపుల్ గా పాడేసింది.
అది కూడా చాలా అందంగా అద్భుతంగా పాడేసింది.ఆమె పాటకి ఇప్పుడు సింగర్స్ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.
భాష రావడమే కష్టం అలాంటిది లిరిక్స్ గుర్తు పెట్టుకుని ఆలియా పాటను పాడడం నిజంగా గొప్ప విషయం అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ బాలీవుడ్ స్టార్ కపుల్ తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.
వీరిద్దరు నిజంగా సూపర్ అంటూ ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.వీరి సినిమా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకోవాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.







