మగాడి కష్టాన్ని ఎప్పటికీ గుర్తించరు.. భార్యతో గొడవకు దిగిన డాక్టర్ బాబు!

బుల్లితెర శోభన్ బాబుగా గుర్తింపు పొందిన నిరుపమ్ పరిటాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.బుల్లితెర వివిధ ప్రసారమవుతున్న ఎన్నో సీరియల్స్ లో నటించిన నిరుపమ్ మాటీవీలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ద్వారా డాక్టర్ బాబుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు కార్తీకదీపం సీరియల్ లో కార్తీక్ పాత్రలో నటించిన నిరుపమ్ అప్పటి నుండి బుల్లితెర ప్రేక్షకులకు అభిమాన హీరోగా మారాడు.

 Nirupam Paritala Funny Clash With Wife Manjula On Vinayaka Chavithi Details, Doc-TeluguStop.com

కొంతకాలం సీరియల్లో కార్తీక్, దీప, మోనిత పాత్రలు కనిపించకపోవడంతో సీరియల్ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి.దీంతో వీరు మళ్లీ ఈ సీరియల్ లో రీ ఎంట్రీ ఇచ్చి కథ నడిపిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సీరియల్లో గతం మర్చిపోయిన డాక్టర్ బాబుగా నిరుమ్ నటిస్తున్నాడు.ఇలా సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు ఏర్పరచుకున్న నిరుమ్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు.

కొంతకాలం క్రితం తన భార్య మంజులతో కలిసి సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు.యూట్యూబ్ ఛానల్ ద్వారా నిరుపమ్ తన భార్య మంజులతో కలిసి హోమ్ టూర్ వీడియోస్, షాపింగ్ వీడియోస్, మేకప్ వీడియోస్, షూటింగ్ కి సంబంధించిన వీడియోలను అలాగే వారి ఇంట్లో జరిగి ప్రత్యేక కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలను కూడా యూట్యూబ్ ద్వారా షేర్ చేస్తూ ఉంటారు.

తాజాగా వినాయక చవితి సందర్భంగా వారింట్లో జరుపుకున్న వినాయకుడి పూజకు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా యూట్యూబ్ ద్వారా షేర్ చేశారు.

Telugu Deepa, Babu, Karthik, Karthika Deepam, Monita, Nirupammanjula, Shobhan Ba

సాధారణంగా నిరుపమ్ తన భార్య మీద ఎప్పుడు పంచులు వేస్తూ ఉంటాడు.తాజాగా షేర్ చేసిన ఈ వీడియోలో కూడా నిరుపమ్ తన భార్య మీద పంచులు వేశాడు.ఈ వీడియోలో మంజుల అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెబుతూ తన మేకప్ అలాగే పండగ సందర్భంగా ఇంటిని ఎలా డెకరేట్ చేసారో చూపించింది.

ఈ క్రమంలో నిరుపమ్ ఏదో పని చేస్తు చూసావా ఎన్ని పనులు చేశానో? అని అనగా .ఇవన్నీ నువ్వే చేశావా? అని మంజుల అంటుంది.దీంతో మగాడి కష్టం మీరూ ఎప్పటికి గుర్తించరు అంటూ బాధ పడతాడు.ఆ తర్వాత నువ్వు మాత్రం రెడీ అయ్యి నన్ను చూడండి అంటూ వచ్చావు అని సెటైర్ వేసాడు.

దీంతో నువ్వు కూడా పంచె, సిల్క్ చొక్కా వేసుకొని బాగా రెడీ అయ్యవుగా అంటూ వీరిద్దరూ గొడవ పడుతూ ఒకరిపై మరొకరు పంచ్ లు వేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube