సినీ సెలబ్రెటీలు చాలా చలకిగా ఉంటారు.అందరిని ఎప్పుడూ నవ్వుతూ పలకరిస్తూ సందడిగా ఉంటారు.
అలాగని వాళ్లకు బాధలు ఉండవని కాదు.ప్రతి ఒక్కరి జీవితంలోని ప్రేమ అనే ఒక ఘట్టం ఉంటుంది.
కొంతమంది దాన్ని జయిస్తారు, మరి కొంతమంది అందులో ఓడిపోతారు.అలాగే ఓ బుల్లితెర నటి కూడా తన ప్రేమ విషయంలో ఓడిపోయినట్టు ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో తెలిసింది.
ఇంతకూ ఆమె ఎవరంటే.
బుల్లితెర నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ రోహిణి.
ఈమె పరిచయం గురించి బుల్లితెర ప్రేక్షకులందరికి తెలిసిందే.మొదట్లో ఈమె పలు సీరియల్స్ లో నటించింది.
ఇక తను నటించిన కొంచెం ఇష్టం.కొంచెం కష్టం సీరియల్ తో మాత్రం మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ఆ తర్వాత పలు సీరియల్లలో అవకాశాలు కూడా అందుకోగా.మాటీవీలో శ్రీనివాస కళ్యాణం అనే సీరియల్ తో కామెడీ కాకుండా తనలోని నటస్వరూపాన్ని కూడా బయటకు తెచ్చింది.
తర్వాత ఇన్స్పెక్టర్ కిరణ్ అనే సీరియల్ లో పోలీస్ పాత్రలో నటించింది.అలాగే జీ తెలుగు కుటుంబ అవార్డ్స్ లో ఎన్నో అవార్డులను సంపాదించుకుంది.ఇక సీరియల్స్ తోనే కాకుండా తన కెరీర్ లో ఇంకా ఎదగాలని బిగ్ బాస్ కి వెళ్ళింది రోహిణి.కానీ అనుకున్నంత ఫలితం రాకపోగా నాలుగో వారానికి తిరిగి వచ్చేసింది.

బిగ్ బాస్ తర్వాత కూడా రోహిణికి అనుకున్నంత అవకాశాలు రాలేదు.కొన్ని సినిమాల్లో నటించిన సరే తగిన గుర్తింపు దక్కించుకోలేకపోయింది.కేవలం టీవీలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు పెడుతూ అందరి మన్ననలు పొందుతూనే ఉంటుంది.
యూట్యూబ్లో తనకంటూ ఒక ఛానల్ ఉంది.
అందులో తను చేసే ప్రతి విషయము వీడియోలుగా అప్లోడ్ చేస్తుంది.ఆ ఛానల్ కి ఫాలోవర్స్ కూడా ఎక్కువమంది ఉన్నారు.
అలాగే టీవీలో కూడా ఎప్పటికప్పుడు జరిగే ప్రతి ప్రోగ్రాంలోని కనిపిస్తూనే ఉంటుంది.అలా ఇటీవలే జీ తెలుగు వారి సమర్పణలో మన ఊరి రంగస్థలం అనే ప్రోగ్రాం ప్రోమోను రిలీజ్ చేశారు నిర్మాతలు.

అందులో సరిగమప స్టార్ లతో పాటు చాలామంది యాక్టర్లతో పాటు రోహిణి కూడా వచ్చింది.అక్కడ అందరూ పాటలతో వాళ్ళ ప్రతిభను చాటుతుండగా రోహిణి తన గతంలో జరిగిన ప్రేమ సంఘటన గురించి తెలిపింది.తను ఒకడిని తొమ్మిది నెలలుగా ప్రేమించినట్టు, కాకపోతే అప్పటికే తనకి లవర్ ఉన్నట్టు చెప్పి ఎమోషనల్ అయ్యింది.
ఇక ఈ సంఘటనపై అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడ బాధపడినట్లు కనిపిస్తుంది.
ప్రస్తుతం ఆమె లవ్ స్టోరీ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.ఇదిలా ఉంచితే ఆ ప్రోగ్రాం లో సరిగమప విన్నర్ యశస్వి కూడా ఒక పాట పడుతూ కనిపించగా ఈ ఎపిసోడ్ కోసం వెయిటింగ్ అని కామెంట్లు పెడుతున్నారు.







