యాంకర్ సుమపై దారుణమైన ట్రోల్స్.. దేవుడు నైవేద్యం ఎంగిలి చేశావ్ అంటూ?

యాంకర్ సుమ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.టాలీవుడ్ లో బెస్ట్ యాంకర్ గా మంచి పేరు అందుకుంది.

 Atrocious Trolls On Anchor Suma God Has Chosen The Offering , Anchor Suma, Enter-TeluguStop.com

నిజానికి స్టార్ నటినటులకు ఉన్నా క్రేజ్ యాంకర్ సుమ సంపాదించుకుంది.ఈమెకు ఉన్న అభిమానం అంతా ఇంతా కాదని చెప్పాలి.

పైగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకొని ఒక లెవెల్ లో దూసుకెళ్తుంది.

బుల్లితెరపై ఎన్నో ఏళ్ల నుండి యాంకరింగ్ చేస్తూ స్టార్ యాంకర్ గా పేరు సంపాందించుకుంది.

నిజానికి మన చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు సుమ అలాగే ఉంది.ఇక వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.

కేవలం ఎంటర్టైన్మెంట్ షోలోనే కాకుండా వెండితెరకు సంబంధించిన సినీ అవార్డు ఫంక్షన్లలో, ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లలో ఇలా ప్రతి ఒక్క ఈవెంట్ లో సుమ హోస్టింగ్ చేస్తూ తన గలగల మాటలతో అందరినీ ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం బుల్లితెరపై పలు షో లలో బాగా బిజీగా ఉంది.

ఈమె మాటలు వింటే మాత్రం ప్రేక్షకులతో పాటు సెలబ్రేటీలు కూడా కరగాల్సిందే.తను వేసే పంచులు కూడా ఇతరులను నొప్పించకుండా ఉంటాయి.

పైగా అందరిని ఎలా కనెక్ట్ చేసుకోవాలో సుమకు తెలుసు.ఇతర భాషలకు చెందిన సెలబ్రెటీలను కూడా సుమ తన మాటలతో బాగా ఆకట్టుకుంటుంది.

ఇప్పటివరకు ఎటువంటి విమర్శలు ఎదురుకాకుండా ఇండస్ట్రీలో కొనసాగుతుంది.అటువంటి సుమకు భవిష్యత్ తరాల వారికి కూడా తన యాంకరింగ్ చూపించే సత్తా తన లో ఉంది అని చెప్పవచ్చు.ఇక సుమ షో కి ఎవరైనా వస్తే చాలు తన పంచులతోనే కాకుండా తన ప్రశ్నలతో కూడా వారిని ఇరకాటంలో పెడుతోంది.దాంతో సుమని తట్టుకొని వాళ్ళు సుమకు పెద్ద దండాలు పెడుతూ ఉంటారు.

ఇక సుమ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తన ఇన్ స్టా ఖాతాలో కూడా బాగా ఫోటోలను, ఫన్నీ వీడియోలను షేర్ చేసుకుంటుంది.

సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకోగా అందులో తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు, వీడియోలను షేర్ చేసుకుంటోంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం సుమ కు సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇక ఆ వీడియోను సుమనే పంచుకుంది.అందులో సుమ నిన్న వినాయక చవితి సందర్భంగా పులిహోర కలుపుతూ కనిపించింది.ఇక దేవుడికి నైవేద్యం పెట్టకు ముందుకే తను రుచి చూసి పక్కన వాళ్ళని ఉప్పు అడిగింది.

ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు అందులో సుమ చేసిన తప్పును పసిగట్టారు.దేవుడికి నైవేద్యం పెట్టకముందుకు రుచి చూడటం ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక మరికొందరు ఈ డబ్బున్న వాళ్లకి సెంటిమెంట్లు అనేవి తెలియవు అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.ప్రస్తుతం ఆ వీడియో మాత్రం బాగా హల్ చల్ చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube