సునీల్, ధన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బుజ్జి ఇలా రా’.‘సైకలాజికల్ థ్రిల్లర్’ అనేది ట్యాగ్‌లైన్.చాందినీ అయ్యంగార్ హీరోయిన్.ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.రూపా జగదీశ్ సమర్పణలో ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ ఎల్ఎల్‌పి, జీ నాగేశ్వరరెడ్డి టీమ్ వర్క్ పతాకాలపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
గరుడవేగ అంజి ఈ సినిమాకి దర్శకత్వం వహించడం తో పాటు సినిమాటోగ్రాఫర్‌గా కూడా వర్క్ చేస్తున్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 2న విడుదలౌతున్న నేపధ్యంలో చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.దర్శకుడు మారుతి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఈ ఈవెంట్ లో నందు, సప్తగిరి, డైమండ్ రత్నబాబు, తాగుబోతు రమేష్ సుడిగాలి సుదీర్, ప్రసన్న , మధు నందన్, రామ సత్యనారాయణ, శకలక శంకర్ తదితరులు హాజరయ్యారు
ధనరాజ్ మాట్లాడుతూ.
ఈ సినిమాకి నిర్మాతలు అసలైన స్టార్స్.నాపై నమ్మకంతో నాలుగు కోట్ల రూపాయిలు ఖర్చుపెట్టారు.సెప్టెంబర్ 2 న ఈ సినిమా థియేటర్లోకి వస్తోంది.పదిమంది చూసి వంద మందికి చెప్పండి.ఇంత మంచి కథకి నేనే కరెక్ట్ అని నమ్మి నాతో సినిమా చేసి నాకు అండగా నిలబడ్డ నాగేశ్వరరెడ్డి గారికి థాంక్స్ మాత్రం చెప్పలేను.
థాంక్స్ చెబితే ఆయన దూరమైపోతారనే భయం.నేను థాంక్స్ చెప్పలేని దేవుడు నాగేశ్వరరెడ్డి గారు.దర్శకుడు అంజి అన్నకు ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుంది.నేను, సునీల్ అన్న మిగతా టీం అంతా గర్వంగా చెప్పుకునే కథ చేశాం.చాందిని కి కృతజ్ఞతలు.ఈ సినిమాతో అందరికీ మంచి విజయం వస్తుంది.
సాయి కార్తిక్ అద్భుతమైన నేపధ్య సంగీతం ఇచ్చారు.మిగతా టెక్నిషియన్స్ అంతా గొప్పగా పని చేశారు.
ఈ చిత్రం కోసం కొందరు చిన్నారులు కూడా ఎంతో చక్కగా నటించారు.సెప్టెంబర్ 2 న సినిమా వస్తోంది.
నాగేశ్వరరెడ్డి గారు చెప్పినట్లు ఈ ఒక్కవారం మా కోసం సినిమా చూడండి.మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది” అన్నారు
దర్శకుడు మారుతి మాట్లడుతూ.
హాస్యం పండించే హాస్యనటులు ఒక థ్రిల్లర్ ని ఎంచుకోవడం ఒక డేరింగ్ స్టెప్.ఇక్కడే మొదటి విజయం సాధించేసింది.
అలాగే జి.నాగేశ్వరరెడ్డి గారు ఇలాంటి థ్రిల్లర్ తో రావాడం కూడా ఆసక్తికరంగా వుంది.సునీల్, ధనరాజ్ లాంటి మంచి నటులతో ఈ కథని తెరకెక్కించడం ఆనందంగా వుంది.అలాగే కెమరామెన్ ని డైరెక్టర్ గా పెట్టడం కూడా అభినందిచదగ్గ అంశం.సాయి కార్తిక్ మంచి మ్యూజిక్ ఇచ్చారు.‘బుజ్జి ఇలా రా’ టైటిల్ తో ఒక థ్రిల్లర్ సినిమా చేయడం చాలా వైవిధ్యంగా వుంది.
సినిమా పట్ల ఇష్టం ఎంతో ఇష్టం వున్న టీం కలసి చేసిన చిత్రమిది.యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్.ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి” అని కోరారు.
నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.
ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి కారణం నా టెక్నికల్ టీం.వారీ రుణపడి వుంటాను.సాయి కార్తిక్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.ఈ సినిమా బడ్జెట్ కి మూడింతలు థియేటర్ లో పే చేస్తుందని గట్టిగా నమ్ముతున్నాను.ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుంది.ఈ సినిమాని ఇంత గ్రాండ్ గా తీయడానికి కారణం నిర్మాతలు ఇచ్చిన బలం.నన్ను చాలా భరించారు.చాందిని అద్భుతంగా చేసింది.
ఈ సినిమా తర్వాత ధనరాజ్ నెక్స్ట్ లెవల్ లో వుంటారు.ఈ ఒక్క శుర్రవారం ధనరాజ్ కోసం ప్రేక్షకులు థియేటర్లోకి వెళ్లాలని కోరుతున్నాను” అన్నారు.
సునీల్ మాట్లాడుతూ.
నాగేశ్వరరెడ్డి ఈ కథ చెప్పినపుడు షాక్ అయ్యా, ఆయన కామెడీ కథ చెప్తారు అని అనుకున్నా, షాకింగ్ కథ చెప్పారు.కథ విన్న వెంటనే ఈ సినిమా మంచి సినిమా అవుతుందని చెప్పాను.చాలా మంచి సందేశం ఇచ్చే సినిమా ఇది.ధనరాజ్ సిన్సియర్ ఆర్టిస్ట్.ఈ సినిమాకి రియల్ హీరోలు నాగేశ్వర్ రెడ్డి, వారి స్నేహితులు.
నాగేశ్వరరెడ్డి గారు ఈ కథతో అంజిని దర్శకుడిగా చేయడం అభినందించదగ్గ అంశం.ధనరాజ్ పాత్ర ఇందులో అద్భుతంగా వుంటుంది.
అలాగే చాందిని పాత్ర కూడా.ఈ సినిమా నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది.
మీకు కూడా నచ్చుతుంది.కంటెంట్ పరంగా ఈ సినిమా చాలా పెద్ద సినిమా.
ఈ సినిమాని సెప్టెంబర్ 2న టికెట్ కొనుక్కుని థియేటర్లో చూడండి.మిమ్మల్ని తప్పకుండా థ్రిల్ చేస్తోంది” అన్నారు.
దర్శకుడు అంజి మాట్లాడుతూ.
ఈ సినిమాతో దర్సకత్వం అంటే ఏమిటో అది ఎంత కష్టమో తెలిసింది.ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం.నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా తీశారు.నాగేశ్వరరెడ్డి గారు మా వెనుక ఎంతో అండ వున్నారు.ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకంగా చెబుతున్నా అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ.
సినిమా చాలా అద్భుతంగా వచ్చింది.సునీల్, అద్భుతంగా చేశారు.నాగేశ్వరరెడ్డి గారికి కృతజ్ఞతలు.చాలా బలమైన కంటెంట్ తో తీసిన చిత్రమిది.సెప్టెంబర్ 2 న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించి మంచి విజయాన్ని ఇవ్వాలని కోరారు.
చాందినీ మాట్లాడుతూ.
ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు.నాగేశ్వరరెడ్డి నాకు తెలుగు లో గురువు.
సునీల్ గారు, ధనరాజ్, అంజి గారు ఇలా చాలా ప్యాషన్ వున్న టీంతో కలసి పని చేయడం ఆనందంగా వుంది.సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున ఈ సినిమా వస్తోంది.
థియేటర్ లో చూడాల్సిన సినిమా.మీ అందరూ థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాను.
తాగుబోతు రమేష్ మాట్లాడుతూ.
నాకు జగడం నుండి ధనరాజ్ తెలుసు.చాలా మంచి నటుడు.ఈ సినిమాలో తెలుగు లో ధనుష్ లా అనిపించాడు.ఈ సినిమాతో ధనరాజ్ ఇంకో మెట్టుఎక్కాలని కోరుకుంటున్నాను.
నందు మాట్లాడుతూ.
చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా ఒక మంచి యూనిట్ కలసి చేసిన సినిమా ఇది.సునీల్ అన్న చిన్న సినిమాలకు కూడా ప్రోత్సహించాలానే గొప్ప ఉద్దేశంతో ఈ సినిమా చేశారు.ధనరాజ్ నాకు మంచి స్నేహితుడు.సినిమా అంటే అతనికి ప్రేమ.జి.నాగేశ్వరరెడ్డి , సాయి కార్తిక్ వీళ్ళంతా చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఈ సినిమాలో భాగమయ్యారు.సెప్టెంబర్ 2న సినిమా వస్తోంది.మీ అందరూ ఈ చిత్రాన్ని థియేటర్ లో చూడాలి” అని కోరారు.
సుడిగాలి సుదీర్ మాట్లాడుతూ.
ధనరాజ్ నాకు మంచి స్నేహితుడు.మేము సినిమా గురించే మాట్లాడుతుంటాం.నాగేశ్వరరెడ్డి గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం.దర్శకుడు అంజి నాకు కెరీర్ బిగినింగ్ నుండి తెలుసు.మంచి టీం కలసి చేసిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను
సాయి కార్తీక్ మాట్లాడుతూ.
ఈ సినిమాలో పాటలు లేకుండా బీజీఏం పైన హెవీగా వర్క్ చేసే అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్.నాగేశ్వరరెడ్డి గారితో వర్క్ చేయడం ఎప్పుడూ ఆనందంగానే వుంటుంది.
ధనరాజ్ ఈ సినిమా కోసం వంద కిలోమీటర్లు రన్ చేస్తుంటారు.ఈ సినిమా అద్భుతంగా వచ్చింది.
థియేటర్ లో చూడాల్సిన సినిమా ఇది.ప్రేక్షకులంతా థియేటర్ లో చూడాలని కోరుకుంటున్నాను.
రామ సత్యనారాయణ మాట్లాడుతూ.
ధనరాజ్ నాకు మంచి స్నేహితుడు.చాలా కష్టపడి ఇండస్ట్రీలో నిలబడ్డాడు.బుజ్జి ఇలా రా’ తప్పకుండా విజయం సాధిస్తుంది” అన్నారు
సప్తగిరి మాట్లాడుతూ.
ధనరాజ్ మాకు స్ఫూర్తి.ఎన్ని కష్టాలు వచ్చిన ధైర్యంగా నిల్చుంటాడు.ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది” అన్నారు.
డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ.
నాగేశ్వరరెడ్డి గారు లక్కీ హ్యాండ్.ఆయన రచయితగా అవకాశం ఇచ్చిన వారంతా దర్శకులు అయ్యారు.
ఆయన ఈ సినిమాకి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కథ, స్క్రీన్‌ప్లే అందించారు.ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
ప్రసన్న మాట్లాడుతూ.
నాకు ఆరోగ్యం బాలేనప్పుడు ధనరాజ్ అన్న తన బైక్ పై ఎక్కించుకొని హాస్పిటల్ జాయన్ చేసి ఎంతో ప్రేమగా చూసుకున్నారు.నేను ఇక్కడ ఇలా మీ ముందు మాట్లాడానికి కారణం ధనరాజ్ అన్నే.ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
మధునందన్ మాట్లాడుతూ.
ట్రైలర్ ప్రామెసింగా వుంది, నాగేశ్వరరెడ్డి గారు గొప్ప ప్రయోగం చేసినట్లే.సునీల్ గారు చాలా సపోర్ట్ చేశారు.ధనరాజ్ సినిమా కోసం బ్రతుకుతున్న నటుడు.ఈ సినిమాతో ధనరాజ్ కి మంచి సక్సెస్ రావాలి” అని కోరారు
శకలక శంకర్ మాట్లాడుతూ.
ఒక హాస్య నటుడు సీరియస్ రోల్ నటిస్తే ఎలా వుంటుందో ఈ చిత్రంతో ధనరాజ్ నిరూపిస్తున్నారు.‘బుజ్జి ఇలా రా’ సెప్టెంబర్ 2 సినిమా పాన్ వరల్డ్ రిలీజ్ అవుతుంది.ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి” అని కోరారు
.