భారత్ లో గత కొన్నిరోజులుగా తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.గడిచిన 24 గంటల్లో 7,946 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా 9,828 మంది కరోనా నుంచి కోలుకోగా .37 మంది మృతి చెందారని వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు.తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,44,33,762కి చేరుకుంది.వీరిలో 4,38,45,680 మంది కోలుకోగా… 5,27,911 మంది కరోనా కాటుకు బలయ్యారు.
ప్రస్తుతం దేశంలో 62,748 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.అదేవిధంగా దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 2.98 శాతంగా ఉంది.రికవరీ రేటు 98.67, క్రియాశీల రేటు 0.14 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నాయి.ఇప్పటి వరకు 212.52 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు.







