విమర్శలు చేయడం, విమర్శల పాలవ్వడం వంటివన్నీ రాజకీయాల్లో సర్వసాధారణం.ఏదో ఒక అంశంతో తమ రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ, ఇరుకుని పెట్టేలా వ్యవహరిస్తూ తాముపై చేయి సాధించాలానే అభిప్రాయంతో కొంతమంది వ్యవహరిస్తూ ఉంటారు.
అందులో ముందు వరుసలో ఉంటారు వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి.జగన్ పైన వైసిపి ప్రభుత్వం పైనా ఎవరు విమర్శలు చేసినా, ఘాటు పదజాలంతో మీడియా, సోషల్ మీడియా వేదికగా విజయ్ సాయి రెడ్డి ఘాటు పదజాలంతో విరుచుకుపడుతూ ఉంటారు.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ టిడిపి అధినేత చంద్రబాబు , ఆయన కుమారుడు లోకేష్ తో పాటు, ఆ పార్టీలోని కీలక వ్యక్తులపై విమర్శలు చేస్తూ ఉంటారు విజయ్ సాయి రెడ్డి.
తాజాగా టిడిపి అధినేత చంద్రబాబు , నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం వెంకట రమణారెడ్డి పై వైరల్ కామెంట్స్ చేశారు.
ప్రపంచంలో ఏం జరిగినా సీఎం జగన్ కి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టడం చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని, నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అనే రీతిలో ఆయన వ్యవహరిస్తున్నారని విజయ్ సాయి రెడ్డి మండిపడ్డారు.దీనికోసం నెల్లూరు జిల్లాకు చెందిన నేత ఆనం వెంకటరమణారెడ్డిని బలి పశువుగా ఎంచుకున్నారని విజయ సాయి కామెంట్ చేశారు.పచ్చ స్క్రిప్టులు చదువుతూ, అందరికీ కామెడీ పంచుతున్నాడు నెల్లూరు నల్ల కుక్క అంటూ కామెంట్ చేశారు.” నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అనే చంద్రబాబు వెకిలి మాటలు.

అందుకే ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా సీఎం గారికి YSRCP కి అంటగడతాడు.ఎందుకు నెల్లూరు నల్ల కుక్కను బలి పశువు చేస్తున్నాడు.తలా తోకాలేని స్క్రిప్ట్ చదువుతూ కొత్త బిచ్చగాడు ఇలా కామెడీ పంచుతున్నాడు” అంటూ కామెంట్ చేశారు.ఇక మరో ట్వీట్ లో నారా లోకేష్ పైన విమర్శలు చేశారు.” నాయకుడు అంటే కార్యకర్తలకు క్రమశిక్షణ నేర్పాలి.‘ ఇంకా నలుగురిని తన్ని జైలుకు రండి చూసుకుంటాను’ అంటున్న లోకేష్ ఎంత మూర్ఖుడో అర్థం అవుతుంది.మీకు పల్లకి మోయడానికి కార్యకర్తలు బలవ్వాలా ? కుప్పంకోట బద్ధలైన ప్రస్టేషనే ఇదంతా ” అంటూ ట్విట్ చేశారు విజయసాయి రెడ్డి.
.