పవన్ కళ్యాణ్ హీరో గా నిత్యా మీనన్ హీరోయిన్గా సాగర్ చంద్ర దర్శకత్వం లో తర్కెక్కిన భీమ్లా నాయక్ తెలుగు లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.మలయాళం సూపర్ హిట్ సినిమా అయిన అయ్యప్పన్ కోషియుం సినిమా కు ఇది రీమేక్ అనే విషయం తెలిసింది.
మలయాళం లో కంటే తెలుగు లో అధిక వసూలను సాధించడం ద్వారా భీమ్లా నాయక్ తో పవన్ కళ్యాణ్ తన సత్తా చూపించాడు.ఇప్పుడు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ తో కలిసి తమిళ్ సినీ ప్రేక్షకుల వద్దకు వెళ్లబోతున్నాడు.
ఆహా డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా తమిళ్ ప్రేక్షకుల వద్దకు ఈ సినిమా ను తీసుకు వెళ్లబోతున్నారు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమా కు రచన సహకారం అందించడం, ఈ సినిమా కు ప్రధాన ఆకర్షణ అనే విషయం తెలిసిందే.
గతం లో పవన్ కళ్యాణ్ నటించిన పలు సినిమా లకు తమిళ్లో మంచి ఆదరణ దక్కింది.కనుక ఈ సినిమా కూడా తప్పకుండా మంచి స్పందన వస్తుందని ఉద్దేశంతో ఆహా తమిళ్ వారు ఈ సినిమాను పెద్ద ఎత్తున స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అతి త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ ని అనౌన్స్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.ప్రస్తుతం అక్కడ భారీ ఎత్తున పవన్ కళ్యాణ్ సినిమా కి ప్రమోషన్ కార్యక్రమాలను చేస్తున్నారు.
తెలుగు లో సూపర్ హిట్ అయిన బీమ్లా నాయక్ తప్పకుండా థియేటర్ రిలీజ్ అవ్వాల్సింది.కానీ అక్కడ థియేటర్ రిలీజ్ కి భీమ్లా నాయక్ సిద్ధం అవ్వలేదు.
కానీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా భీమ్లా నాయక్ తమిళ్ ప్రేక్షకుల వద్దకు వెళ్లబోతున్న నేపథ్యం లో అభిమానులు మరియు ప్రేక్షకులు ఆసక్తి గా అక్కడ ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వం లో హరిహర వీరమల్లు సినిమాలు చేసిన విషయం తెలిసిందే.
అది మాత్రమే కాకుండా తమిళ్ సినిమా ఒకటి రీమేక్ చేయబోతున్నాడు.అందులో సాయిధరమ్ తేజ్ కీలకపాత్రలో కనిపించబోతున్నాడు.







