కడప-తాడిపత్రి జాతీయ రహదారిపై వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.దీంతో కమలాపురం నుంచి ఖాజీపేట మీదుగా వాహన రాకపోకలకు మల్లిస్తున్నారు పోలీసులు.
అయితే వెల్లిగల్లు ప్రాజెక్ట్ నుంచి మూడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు.దీంతో కమలాపురం పాపాగ్ని నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.
ఈ క్రమంలో అప్రోచ్ రోడ్డు మరోసారి కోతకు గురి అవుతుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.







