టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన తాజా చిత్రం లైగర్ .ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి జోడిగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటించగా ప్రముఖ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా ప్రధాన పాత్రలో నటించాడు.
పూరి జగన్నాథ్, చార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాల మధ్య విడుదల అయింది.ఈ సినిమా విడుదలైన మొదటి షో నుండే నెగటివ్ టాక్ మూటగట్టుకొని ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది.
తెలుగు రాష్ట్రాలలో డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా బాలీవుడ్ లో మాత్రం మంచి ఓపెనింగ్స్ సాధించి మంచి వసూళ్లు రాబట్టింది.
దాదాపు రెండేళ్లు కష్టపడి భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా కథలో లోపాలు ఉండటం వల్ల అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను చేరుకోలేకపోయింది.
ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, టీజర్ ప్రేక్షకులలో సినిమా మీద భారీ అంచనాలను పెంచాయి.అందువల్ల ఎంతో కాలం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూసిన ప్రేక్షకులు సినిమా విడుదలైన తర్వాత బాగా నిరాశ చెందారు.
ఇదిలా ఉండగా ఇటీవల విజయ్ దేవరకొండ మైక్ టైసన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.సినిమా షూటింగ్ సమయంలో మైక్ టైసన్ తనని బూతులు తిట్టాడని అవన్నీ తాను బయటికి చెప్పలేనని వెల్లడించాడు.
దీంతో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ మాట్లాడుతూ.సినిమా షూటింగ్ సమయంలో మైక్ టైసన్ చాలా సందర్భాలలో నన్ను బూతులు తిట్టాడు.కానీ అవన్నీ నేను బయటికి చెప్పుకోలేను.అయితే తన మీద ఉన్న ప్రేమతోనే టైసన్ తనని అలా తిట్టాడని విజయ్ వెల్లడించాడు.అంతేకాకుండా మన దేశం పట్ల మైక్ టైసన్ కి చాలా గౌరవం ఉందని, ఇండియాలో లభించే ఆహారం మ్యూజిక్ ని బాగా ఎంజాయ్ చేస్తాడని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ మైక్ టైసన్ గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.