కాంగ్రెస్ పార్టీకి ఇటీవల వరుస షాక్ లు తగులుతూనే ఉన్నాయి.పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడుతున్నారు.
తాజాగా మరో సీనియర్ నాయకుడు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు.జమ్ముకశ్మీర్ మాజీ సీఎం గులాంనబీ ఆజాద్ పార్టీని వీడి 24 గంటలు కూడా గడవక ముందే మరో నేత పార్టీకి రాజీనామా చేశారు.
హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు ఎంఏ ఖాన్ కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.గతంలో ఆయన ఆజాద్ కు అనుచరుడిగా ఉన్న విషయం తెలిసిందే.







