విజయనగరం జిల్లాలో గత కొన్ని రోజులుగా పులి సంచారం కలకలం సృష్టిస్తోంది.ఈ క్రమంలోనే తాజాగా మెంటాడ మండలం మేడపల్లి మోడల్ స్కూల్ పరిసర ప్రాంతాల్లో పులి కనిపించింది.
దీంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.దీంతో విద్యార్థులను ఇళ్లకు పంపించే ఏర్పాట్లు చేపట్టిన ప్రిన్సిపాల్ .ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.ఈ క్రమంలో స్కూల్ కు చేరుకున్న అధికారులు పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.







