ఏపీ సీఎం జగన్ కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది.సీబీఐ కోర్టులో రోజువారీ విచారణకు ఆయన వ్యక్తిగత హాజరుకు హైకోర్టు మినహాయింపు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
సీబీఐ కోర్టు విచారణల నేపథ్యంలో.వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం విచారణ జరిపింది.
ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.జగన్ వ్యక్తిగత హాజరుపై సీబీఐ కోర్టు ఆదేశాలను కొట్టేసింది.
అదేవిధంగా తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాలన్న సమయంలో మాత్రం విచారణకు రావాలని పేర్కొంది.అయితే, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో జగన్ పై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.







