బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో ఎదగడం సులువు కాదనే సంగతి తెలిసిందే.అయితే విజయ్ దేవరకొండ మాత్రం సినిమా రంగంలో విషయంలో సక్సెస్ అయ్యారు.
కెరీర్ తొలినాళ్లలో విజయ్ దేవరకొండ చిన్నచిన్న పాత్రల్లో సైతం నటించారు.పెళ్లిచూపులు, గీతా గోవిందం, ట్యాక్సీవాలా సినిమాలలో సాఫ్ట్ రోల్స్ లో నటించి తన నటనతో విజయ్ దేవరకొండ మెప్పించారు.
అయితే అర్జున్ రెడ్డి సినిమానే అతని కెరీర్ కు ఒక విధంగా ప్లస్ అయితే ఒక విధంగా మైనస్ అయింది.
చాలామంది హీరోలతో పోల్చి చూస్తే విజయ్ దేవరకొండ కొన్ని విషయాలలో బెటర్ అని చెప్పవచ్చు.
మనస్సులో ఒక విధంగా బయటకు ఒక విధంగా మాట్లాడటానికి విజయ్ దేవరకొండ ఇష్టపడరు.అయితే సినిమాల్లో ప్రదర్శించిన యాటిట్యూడ్ నే విజయ్ దేవరకొండ నిజ జీవితంలో ప్రదర్శించి విమర్శల పాలవుతున్నారు.
విజయ్ దేవరకొండను అభిమానించే అభిమానులు కోట్ల సంఖ్యలోనే ఉన్నారు.అయితే తన యాటిట్యూడ్ వల్ల విజయ్ దేవరకొండకు లాభం కంటే నష్టం కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.
తనలా తను ఉండటానికి ఇష్టపడే విజయ్ దేవరకొండ ఎలాంటి సందర్భంలోనైనా డౌన్ టు ఎర్త్ ఉండాలని అనవసర వివాదాలకు దూరంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

రియల్ లైఫ్ లో విజయ్ దేవరకొండ చాలా మంచోడని కానో కొన్ని సందర్భాల్లో ప్రవర్తన వల్ల విజయ్ దేవరకొండపై నెగిటివ్ ఒపీనియన్ కలుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.విజయ్ దేవరకొండ ఒక సందర్భంలో మూడ్ ను బట్టి, అకేషన్ ను బట్టి నా మాటలు ఉంటాయని తెలిపారు.

సాధారణంగా విజయ్ ఎలా ఉన్నా తప్పులేదని సెలబ్రిటీ కాబట్టి విజయ్ విమర్శలకు తావివ్వకుండా కెరీర్ ను కొనసాగించాలని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.అర్జున్ రెడ్డి సినిమాలో ఒక వర్డ్ పెట్టడం గురించి విజయ్ దేవరకొండ స్పందిస్తూ అర్జున్ రెడ్డి పాత్ర అలా ఉందని మ్యాన్ గురించి అబ్యూస్ చేసినా పెద్దగా ఫీల్ కామని కానీ ఉమెన్స్ గురించి అంటే ఫీలవుతామని విజయ్ దేవరకొండ వెల్లడించారు.







