ఖైర‌తాబాద్ వినాయ‌కునికి తుది రూపు..!

వినాయ‌క చ‌వితి వ‌స్తుందంటే అంద‌రి మ‌దిలో ముందుగా మెదిలేది ఖైర‌తాబాద్ బొజ్జ గ‌ణ‌పయ్య‌.గ‌ణేష్ చ‌తుర్థి కోసం హైద‌రాబాద్ ముస్తాబ‌వుతోంది.

 Final Form Of Khairatabad Vinayaka..!-TeluguStop.com

భారీ ఆకారంలో ద‌ర్శ‌నం ఇచ్చే ఖైర‌తాబాద్ గ‌ణ‌ప‌య్య‌కు ఒక్క హైద‌రాబాద్ లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ ప్ర‌త్యేక గుర్తింపు ఉంది.ఎప్పుడు వారం రోజుల ముందే త‌యార‌య్యే గ‌ణేష్ విగ్ర‌హ త‌యారీ.

ఈ సారి పండుగ‌కి రెండు రోజుల ముందు త‌యారు కానుంది.ఈ నేప‌థ్యంలో ఈ నెల 28న ఉద‌యం 7 నుంచి 8 గంట‌ల మ‌ధ్య‌లో తుది ఘ‌ట్ట‌మైన క‌ళ్లు తీర్చిదిద్ది తుది రూపు ఇవ్వ‌నున్నట్లు శిల్పి రాజేంద్ర‌న్ తెలిపారు.

ఉత్సవ కమిటీ చైర్మన్‌ సింగరి సుదర్శన్‌, శిల్పి రాజేంద్రన్‌, కన్వీనర్ సందీప్ రాజ్ కలిసి గణపతి నమూనాను డిజైనర్‌తో రూపొందిస్తారు.గణపతి పంచ ముఖాలు పంచ భూతాలుగా రక్షణనిస్తాయని, లక్ష్మీగణపతిని పూజించడం వల్ల సుఖాలు, ధన ప్రాప్తి కలుగుతాయి.

వినాయకుడితోపాటు షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామిని పూజిస్తే శత్రు నాశనం కలుగుతుందని, మరొక వైపు త్రిశక్తిగా పిలువబడే మహాగాయత్రీ దేవికి పూజలు చేస్తే ప్రజలందరికీ శుభాలు కలుగుతాయని శిల్పి రాజేంద్రన్‌ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube