తెలుగు చలన చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ల మధ్య ఎంత పోటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో వీరి మధ్య మరింత పోటీ ఎక్కువ అయ్యింది.
అయితే మన టాలీవుడ్ లో ఇది ఆహ్లాదకరంగానే సాగుతుంది.వీరు సినిమాల వరకు మాత్రమే పోటీ పడుతూ ఉంటారు.
కానీ బయట కనిపిస్తే మాత్రం స్నేహంగా మెలుగుతారు.ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ మంచి సన్నిహితముగా ఉంటారు అనే విషయం చాలా వరకు అందరికి తెలుసు.ఎవరిదైనా సినిమా రిలీజ్ కాబోతుంటే ప్రొమోషన్స్ లో పాల్గొనడం.వారికీ తమ బెస్ట్ విషెష్ అందించు కోవడం.
వీలు కుదిరితే అప్పుడప్పుడు అందరు కలిసి పార్టీ చేసుకోవడం వంటివి చేస్తూనే ఉంటారు.
అయితే తాజాగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు మాత్రమే కాదు.
నేటి తరం యువ డైరెక్టర్లు కూడా ఒక దగ్గర చేరిపోయారు.మరి వీరు కలవడానికి కారణం ఏంటి అని ఆరా తీస్తున్నారు.

వీరంతా కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఇలా టాప్ డైరెక్టర్స్ తో పాటు నేటి తరం డైరెక్టర్లు కూడా ఒకే ఫ్రేమ్ లో కనిపించడం అందరిని ఆకర్షిస్తుంది.
వీరందరూ ఈసారి కలవడానికి కారణం టాలీవుడ్ లో సమస్యలను పరిష్కరించడం కోసం అని తెలుస్తుంది.ప్రెజెంట్ మన టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం చర్చ జరిపినట్టు తెలుస్తుంది.
ఇక వీరి చర్చలు సఫలం అవ్వడంతో సెప్టెంబర్ 1 నుండి మళ్ళీ యధావిధిగా షూటింగులు జరగనున్నాయి.







