మీరు పారాసెటమాల్‌ను ఎక్కువగా వాడుతున్నారా? అయితే ఈ విషయంలో జాగ్రత్త!

ఇక్కడ పారాసెటమాల్‌ టాబ్లెట్ అంటే తెలియని మనుషుల బహుశా ఉండరేమో.అంతలాగ ఈ డ్రగ్ జనాల్లోకి దూసుకుపోయింది.

 Are You Using Too Much Paracetamol , But Be Careful In This Matter , Paracetamol-TeluguStop.com

మనలో ఎవరికన్నా జ్వరం, ఒంటినొప్పులు, వాంతులు, ఇలా రకరకాల సమస్యలు తలెత్తగానే వెంటనే గుర్తొచ్చే టాబ్లెట్ ఒక్కటే.అదే పారాసెటమాల్‌.

అవును, సాధారణంగా జ్వరం, తలనొప్పి వంటివి రాగానే ముందుగా పారాసెలమాల్‌ వాడుతుంటారు.ఈ ఔషధాన్ని ఎప్పుడు ఏ పరిమాణంలో ఉపయోగించాలో చాలా మందికి తెలియదు.

ఎవరి ఇష్టానుసారంగా వారు వాడుతూ వుంటారు.

అయితే ఇలా వాడినప్పుడు సమస్య మరింతగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు.

శరీరంలో ఏదైనా పెద్ద రోగానికి సంకేతం లేని లక్షణాలు కనిపించినట్లయితే, లేదా ఏదైనా చిన్నపాటి నొప్పి ఉన్నట్లయితే వాటి నుంచి రక్షించుకునేందుకు వివిధ రకాల మందులను వాడుతుంటాము.కానీ వాటి వల్ల ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

పారాసెటమాల్ తరచుగా తీసుకోవడం వల్ల నష్టాలు కలిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు వైద్యులు.

Telugu Care, Tips, Helath, Medical, Paracetamol-Latest News - Telugu

పారాసెటమాల్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల అల్సర్‌ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు.తరచుగా జ్వరం వచ్చినప్పుడు పారాసెలమాల్‌ మందులను ఉపయోగిస్తారు.కానీ ఈ ఔషధాన్ని డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్ లేకుండా, ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎక్కువగా తీసుకుంటే అప్పుడు ఎసిడిటీ సమస్య, కడుపులో అల్సర్లు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు.

ఇవి తీవ్రమైతే రక్తం వాంతులు కూడా వచ్చే ప్రమాదం ఉందంటున్నారు.పారాసెలమాల్‌ ఎక్కువగా వాడితే అలెర్జీలతో పాటు మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.దీని వల్ల మీకు ఎలర్జీలు, చర్మంపై దద్దుర్లు, రక్త సంబంధిత సమస్యలు వస్తాయి.వైద్యులను సంప్రదించకుండా పారాసెలమాల్‌ వేసుకుంటే కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉందంట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube