పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన లైగర్ సినిమాకు ప్రేక్షకుల నుంచి యావరేజ్ టాక్ వచ్చింది.అటు పూరీ జగన్నాథ్ అభిమానులను ఇటు విజయ్ దేవరకొండ అభిమానులను పూర్తిస్థాయిలో మెప్పించేలా ఈ సినిమా లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
రొటీన్ కథ, కథనంతో పూరీ జగన్నాథ్ గత సినిమాలలా ఈ సినిమా కూడా ఉందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వైరల్ అయిన కథనే సినిమాలో కూడా ఉండటంతో ప్రేక్షకులు మరింత నిరాశ చెందుతున్నారు.
లైగర్ సినిమా ఫలితంతో పూరీ జగన్నాథ్ కు స్టార్ హీరోలు ఛాన్స్ ఇవ్వడం కష్టమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.పూరీ జగన్నాథ్ దర్శకత్వ ప్రతిభపై నెగిటివ్ కామెంట్లు చేయలేమని అయితే ఇతర రచయితలు రాసిన కథలను పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
పూరీ జగన్నాథ్ వక్కంతం వంశీ ఇచ్చిన కథతో తెరకెక్కించిన టెంపర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఇతర సినిమాల విషయంలో కూడా పూరీ జగన్నాథ్ ఇదే విధంగా వ్యవహరిస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రొటీన్ కథలతో పూరీ జగన్నాథ్ ప్రేక్షకులకు విసుగు తెప్పించినంత కాలం ఆయనకు ఫ్లాపులు తప్పవని కామెంట్లు వినిపిస్తున్నాయి.

నిర్మాతగా కూడా పూరీ జగన్నాథ్ కు ఈ సినిమా భారీ మొత్తంలో నష్టాలను మిగిల్చే అవకాశం ఉంది.పూరీ జగన్నాథ్ కథే రాసుకోకుండా లైగర్ ను తెరకెక్కించారా అని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మైక్ టైసన్ పాత్ర కూడా సినిమాలో తేలిపోయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
పూరీ జగన్నాథ్ తర్వాత సినిమాలు కూడా ఇదే తరహాలో తెరకెక్కితే మాత్రం ఆయన కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది.హిందీలో కూడా ఈ సినిమా సక్సెస్ సాధించే అవకాశాలు లేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.







