ఏపీ ప్రభుత్వ సలహాదారు జె.శ్రీకాంత్ నియామకంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేశారు.
దేవదాయ శాఖ సలహాదారుగా శ్రీకాంత్ ను ప్రభుత్వం నియమించింది.అయితే అదే సమయంలో పలు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
అనంతరం ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించారు.దేవదాయ శాఖ సలహాదారుగా శ్రీకాంత్ నియామకం నిబంధనలకు విరుద్ధమని తమ పిటిషన్లలో పేర్కొన్నారు.
ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం.శ్రీకాంత్ నియామక ఉత్తర్వులపై స్టే విధించింది.







