యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ మరియు శంకర్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమా కు సీక్వెల్ ను దాదాపుగా మూడు సంవత్సరాల క్రితం ప్రారంభించిన విషయం తెల్సిందే.కానీ ఏదో ఒక కారణం వల్ల సినిమా షూటింగ్ ఆగి పోతూ వచ్చింది.
షూటింగ్ సందర్భంగా జరిగిన ప్రమాదం తో మొత్తం షూటింగ్ ను దాదాపుగా రెండేళ్ల నుండి ఆపేశారు.లైకా ప్రొడక్షన్స్ వారి అసత్వం కారణంగా తన విలువైన సమయం వృదా అయ్యింది అంటూ దర్శకుడు శంకర్ కోర్టును ఆశ్రయించి ఇండియన్ 2 నుండి బయట పడ్డాడు.
రామ్ చరణ్ తో సినిమా ను మొదలు పెట్టాడు.కానీ లైకా వారు మళ్లీ కోర్టును ఆశ్రయించడం మరియు కమల్ హాసన్ మధ్యవర్తిత్వం వల్ల సినిమా షూటింగ్ ను ప్రారంభించేందుకు శంకర్ ఒప్పుకున్నాడు.
రేపటి నుండి సినిమా షూటింగ్ పునః ప్రారంభం అవ్వాల్సి ఉంది.కానీ నేడు పూజా కార్యక్రమాలు వైభవంగా జరగడంతో అంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.
సినిమా గతంలోనే ప్రారంభం అయ్యింది కదా మళ్లీ ఎందుకు ఈ స్థాయిలో సినిమా ప్రారంభోత్సవం చేశారు.సినిమా ను మళ్లీ కొత్త గా ప్రారంభించినట్లుగా ఈ హడావుడి ఏంటో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
నిజంగానే ఇండియన్ 2 ను మొదటి నుండి షురూ చేస్తున్నారా లేదంటే మధ్య లో వదిలేసిన వద్ద నుండి ప్రారంభిస్తారా అంటూ ఆసక్తిగా అంతా ప్రశ్నిస్తున్నారు.గతంలో దాదాపుగా మూడు నెలల పాటు షూటింగ్ ను నిర్వహించారు.
భారీ గా ఖర్చు కూడా చేశారు.ఇప్పుడు సినిమా ను మళ్లీ మొదటి నుండి చేయాలి అంటే ఎక్కువ సమయం పడుతుంది.
మరియు ఎక్కువ బడ్జెట్ కూడా అవుతుంది.అందుకే ఇండియన్ 2 ను ఎక్కడ ఆపేశారో అక్కడ నుండే తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది.
కానీ పూజా కార్యక్రమాలు నిర్వహించింది మాత్రం మళ్లీ ఎలాంటి అడ్డంకులు రాకూడదు అనే ఉద్దేశ్యంతో అంటూ కొందరు తమిళ మీడియా వర్గాల వారు చర్చించుకుంటున్నారు.