సోషల్ మీడియాలో నిరంతరం అనేకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.అందులో కొన్ని ఎమోషనల్ గా ఉంటే, మరికొన్ని ఫన్నీగా ఉంటాయి.
ఇంకొన్ని వీడియోలు భలే గమ్మత్తుగా ఉంటాయి.ఇపుడు గమ్మతుగా కనబడబోయే ఓ వీడియో గురించి మాట్లాడుకుంటున్నాం.అవును… బేసిగ్గా కరెంట్ స్తంబాలు అనేవాటిని ఎక్కువగా పురుషులే ఎక్కుతారు.మహిళలు అలాంటివి చేయలేరు.
అలాంటి సాహసం కూడా చేయరు.ఇకపోతే కొద్ది రోజుల క్రితం విద్యుత్ శాఖలో ఒక మహిళ లైన్ ఉమెన్‌గా సెలక్ట్ అయి, ఆమె అవలీలగా కరెంట్ స్తంభాలు ఎక్కటం చూసి మనం గొప్పగా చెప్పుకున్నాము.
అయితే ఇక్కడ ఒక మహిళ కరెంట్ స్తంభాన్ని పట్టుకుని దానిపై ఏరోబిక్స్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇది ఏ దేశంలో జరిగిందో తెలియదు కానీ నెక్స్ట్ లెవల్ స్కిల్స్ అనే ట్విట్టర్ యూజర్ తన ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అయింది.
బ్లాక్ డ్రస్ ధరించిన మహిళ తన హై హీల్స్ తీసి వీధి దీపం స్తంభాన్ని అవలీలలగా ఎక్కడమే కాకుండా అక్కడున్న ఐరన్ రాడ్ పట్టుకుని ఏరోబిక్స్ చేయటం ప్రారంభించింది.
ఈవీడియో ఇప్పటి వరకు లక్షల్లో వ్యూస్ సంపాదించింది.
దాదాపు 10 లక్షల చేరువలో వుంది.ఆ కౌంట్ కంటిన్యూ అవుతూ వుంది.
వాటితో పాటు నెటిజన్ల రియాక్షన్ కూడా అద్భుత రీతిలో ఉంది.ఆమె రిస్క్ చేస్తోందని కొందరు కామెంట్ చేయగా, ఆ మహిళ ధైర్య సాహాసాలకు గులాం అని కొందరు, ఆమె శక్తియుక్తుల ముందు మగవారు బలాదూర్ అని మరికొందరు ప్రశంసించారు.
ఇకపోతే ఆ వీడియో ఏ లొకేషన్ కి సంబంధించిందో మాత్రం తెలిసి రాలేదు.మీరు కూడా దాన్ని తిలకించి మీమీ అభిప్రాయాలను తెలియజెప్పండి.







