బీహార్ లో ఆసక్తికరణ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఓ వైపు నితీష్ కుమార్ ప్రభుత్వం బలపరీక్ష ఉండగా, మరోవైపు ఆర్జేడీ నేతల నివాసాల్లో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా బీహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఆర్జేడీ, కాంగ్రెస్ తో మహా కూటమిగా ఏర్పడిన నితీష్ కుమార్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో సీఎంగా నితీష్ కుమార్, డిప్యూటీ సీఎంగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పదవి చేపట్టగా.వీరికి 165 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉంది.
ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ నేతృత్వంలోని మహాఘటబంధన్ ప్రభుత్వం ప్రత్యేక సమావేశాల్లో బలపరీక్షకు సిద్ధమైంది.
అయితే, బలపరీక్షకు ముందే బీహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా రాజీనామా చేశారు.
తనపై తప్పుడు ఆరోపణలు రావడంతో పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు.తనపై సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం అస్పష్టంగా ఉందని, నిబంధనల ప్రకారం లేదని సభలో సిన్హా వ్యాఖ్యనించారు.







