టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించబోతున్నారు.మూడు రోజులపాటు కుప్పంలో మకాం వేయనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా క్లస్టర్, యూనిట్ క్లస్టర్, బూత్ ఇంఛార్జీలతో భేటీ కానున్నారు.అనంతరం వారి పనితీరు, పార్టీ సభ్యత్వ నమోదును కూడా సమీక్షించనున్నారు.
ఈ క్రమంలో ఓటర్ల జాబితాపై పార్టీ శ్రేణులను చంద్రబాబు అప్రమత్తం చేయబోతున్నారు.అదేవిధంగా పలు సూచనలు చేయబోతున్నట్లు సమాచారం.
కుప్పం పరిధిలో మొత్తం 11 క్లస్టర్లు ఉండగా.ప్రతి క్లస్టర్ కు 45 నిమిషాల సమయాన్ని చంద్రబాబు కేటాయించనున్నట్లు సమాచారం.







