సుధీర్ ను ఘోరంగా అవమానించిన హైపర్ ఆది.. ఎందుకు ఉన్నావ్ అంటూ?

బుల్లితెరపై సుడిగాలి సుధీర్ కు ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే.సుధీర్ రష్మీ జోడీ కలిసి స్కిట్ చేసినా డ్యాన్స్ చేసినా ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చేది.

 Hyper Aadi Punches About Sudigali Sudheer Goes Viral In Social Media , Sudheer,-TeluguStop.com

ఈటీవీ ఛానల్ లో ఉన్న సమయంలో సుడిగాలి సుధీర్ పేరు మారుమ్రోగింది.అయితే ఎవరూ ఊహించని విధంగా సుడిగాలి సుధీర్ రెమ్యునరేషన్, ఇతర కారణాల వల్ల ఈటీవీకి గుడ్ బై చెప్పి స్టార్ మా ఛానల్ లోని ప్రోగ్రామ్స్ తో బిజీ అయ్యారు.

అయితే ఈటీవీ ద్వారా సుధీర్ కు పాపులారిటీ వస్తే స్టార్ మా ఛానల్ లోని ప్రోగ్రామ్స్ మాత్రం అతనికి మైనస్ అయ్యాయి.స్టార్ మా ఛానల్ లో సుధీర్ షోలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో ఆయన అభిమానులు సైతం ఫీలయ్యారు.

అయితే ఏం జరిగిందో తెలీదు కానీ ఈటీవీలో మల్లెమాల నిర్వహిస్తున్న ఒక ఈవెంట్ లో సుధీర్ ప్రత్యక్షమయ్యారు.ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.

ఈటీవీ 27 ఇయర్స్ సెలబ్రేషన్స్ పేరుతో భలే మంచి రోజు పేరుతో ఈ ఈవెంట్ ప్రసారం కానుంది.ప్రముఖ బుల్లితెర నటి హరిత మా పెళ్లి ఈటీవీలో జరిగిందని ఈటీవీ జీవితాన్ని ఇచ్చిందని చెప్పగా పోసాని కృష్ణమురళి ఈటీవీ వీడికి పెళ్లాన్ని ఇవ్వలేదు ఎందుకమ్మా అని ప్రదీప్ గురించి పోసాని కృష్ణమురళి కామెంట్ చేశారు.

ఆ తర్వాత సుధీర్ ఎంట్రీ ఇవ్వగా హైపర్ ఆది సుధీర్ తో ఒక్కసారి మారితే అందరూ మారతారు మరీ అంటూ పంచ్ వేశారు.

Telugu Etv, Posanikrishna, Pradeep, Rashmi, Sudheer-Movie

వీళ్లతో ఎంట్రీ ఏంటని సుధీర్ అడగగా నువ్వు వస్తున్నావని తెలిస్తే ఎంట్రీనే కాదు అసలు ఈవెంట్ ఒప్పుకోనని వాడు అన్నాడని ఇమ్మాన్యుయేల్ చెప్పగా అవతలి వ్యక్తి అవును అని చెప్పుకొచ్చారు.ప్రదీప్ సుధీర్ తో మిమ్మల్ని అందరినీ ఈయన ఒక్కచోట ఉంచుతాడని చెప్పగా ముందు ఆయనను ఒకచోట ఉండమను అంటూ ఆది సుధీర్ పరువు తీసేశారు.మనకు బ్రేక్ ఎప్పుడుందని సుధీర్ అడగగా నీకు మేము ఎప్పుడో బ్రేక్ ఇచ్చామని ఎందుకు ఉన్నావంటూ ఆది సుధీర్ పై పంచ్ లు వేశారు.

ఇప్పుడు నేను మారిపోయాను సార్ అని సుధీర్ చెప్పగా పక్క ఛానెల్ కా అంటూ ఆది పంచ్ వేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube