పురి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న లైగర్ సినిమా మరో రెండు రోజుల్లో రాబోతుంది.ఈ సినిమా ప్రమోషన్స్ పీక్స్ లో చేస్తున్నారు.
ఇప్పటికే దేశం మొత్తం తిరిగి ప్రమోట్ చేస్తున్న లైగర్ టీం ఇప్పుడు తెలుగులో మరింత ఎక్కువ దృష్టి పెట్టింది.ఈ టైం లో పుష్పతో ఆల్రెడీ పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ కొట్టిన సుకుమార్ తో పూరీ జగనాథ్ స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు.
లైగర్ కూడా నేషనల్ లెవల్ లో భారీ రేంజ్ లో రిలీజ్ అవుతున్న సందర్భంగా పుష్ప డైరక్టర్ సుకుమార్ లైగర్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ స్పెషల్ చిట్ చాట్ నిర్వహించారు.
లైగర్ కి సంబందించిన ఇంట్రెస్టింగ్ విషయాల గురించి.
సినిమా గురించి పూరీ మరిన్ని డీటైల్స్ ఈ స్పెషల్ ఇంటర్వ్యూలో ఇచ్చినట్టు తెలుస్తుంది.పూరీ, సుకుమార్ ఇద్దరు కలిసి చేసిన ఈ ఇంటర్వ్యూ ఆడియెన్స్ కి థ్రిల్ అందిస్తుందని చెప్పొచ్చు.
విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా నటించిన లైగర్ సినిమాలో మైక్ టైసన్ కూడా ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటించారు.ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా చాటాలని చూస్తున్నాడు విజయ్ దేవరకొండ.








