కోహ్లీ భార్యను పట్టుకొని పత్తి కర్రలంటూ ట్రోల్ చేస్తున్న నేటిజన్స్.. వైరల్ అవుతున్న ఫోటో!

సినిమా ఇండస్ట్రీలో నటి అనుష్క శర్మ క్రేజ్ ఏంటో మనకు తెలిసిందే.ప్రస్తుతమైతే ఈమె సినిమాలకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ ఒకప్పుడు మాత్రం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించారు.

 Netizens Trolls On Virat Kohli Wife Anushka Sharma Details, Kohli's Wife,anushka-TeluguStop.com

ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రేమలో పడ్డారు.అయితే కొంతకాలం పాటు ప్రేమలో ఉన్న ఈ జంట ఎంతో ఘనంగా వివాహం చేసుకొని పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.

ఈ విధంగా తన కూతురు బాగోగులు చూసుకుంటూ అనుష్క శర్మ సినిమాలకు కాస్త దూరమయ్యారు.ఇకపోతే సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీతో పాటు అనుష్క చేసే రచ్చ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే.

ఇక క్రికెట్ కోసం కోహ్లీ ఎక్కడికి వెళ్లినా అనుష్క తన వెంట వెళ్తూ పెద్ద ఎత్తున తన కూతురు భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు.ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే అనుష్క శర్మ తనకు సంబంధించిన అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక ఫోటో షేర్ చేశారు.

Telugu Anushka Sharma, Anushkasharma, Bollywood, Cricketer, Kohlis, Virat Kohli,

ఈ ఫోటోలో తెలుపు రంగు ధరించి ఏంజెల్ లా ఉన్నారు.ఇలా తెలుపు రంగు డ్రెస్సులో కాలు మీద కాలు వేసుకొని కూర్చుని ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేశారు.ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇది చూసిన నెటిజన్ లు అనుష్క శర్మ కాళ్లు చేతులు ఏంటి మరి పత్తి కర్రల్లా వేలాడుతున్నాయి అంటూ పెద్ద ఎత్తున తనని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.ఇక ఈ ట్రోల్స్ పై విరుష్క ఫ్యాన్స్ స్పందిస్తూ.

అనుష్క ఏంజెల్ లా కనిపిస్తూ ఉంటే మీరు వంకలు వెతికి ట్రోల్ చేయడానికి సిద్ధమయ్యారు అంటూ పెద్ద ఎత్తున అభిమానులు మండిపడుతున్నారు.ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈమె చెక్ దే ఎక్స్ప్రెస్ అనే సినిమాలో నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube