ఎవరి సృజనాత్మకత వారిది.కాదేది కవితకు అనర్హం అనే విషయం అనేకమంది రుజువు చేస్తారు.
మనలో అనేకమంది ఏం చేసినా కాస్త కొత్తదనాన్ని కోరుకుంటారు.ఏం చేసినా సమథింగ్ స్పెషల్ గా ఉండాలనేది వారి ఆలోచన.
అలా వారు చేసే ప్రతిపనిలో కూడా కాస్త వెరైటీ ధోరణి కనబరుస్తారు.ఇక పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరపురాని క్షణంగా చెప్పుకోవచ్చు.
ఎందుకంటే అది ఒక్కసారి మాత్రమే జరుగుతుంది.జీవితాంతం గుర్తుండుపోయే జ్ఞాపకంలాగ ఉండాలని వారు కలలుకంటూ వుంటారు.
ఎదుటివారికి ఎలాగున్నా తమకు మాత్రం ఓ మరిచిపోలేని అనుభూతిగా ఉండాలని అనుకుంటారు.పెళ్లికి పిలవడానికి కొట్టించే వెడ్డింగ్ కార్డు నుండి, భోజనాలలో వడ్డించే ఆహారపదార్ధాల వరకూ అన్నీ కొత్తగా కనబడాలని చూస్తూ వుంటారు.
ఇక్కడ కథను వింటే వీడెవడ్రా బాబు వారికి బాబులాగా వున్నాడని మీరే అంటారు.తమిళనాడుకు చెందిన ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ తన పెళ్లికి పిలవడానికి ఓ ఇంటికెళ్లాడు.
అవతలివారికి ఇతను ఫార్మసీ కాలేజీలో అధ్యాపకుడని అని అతనికి తెలుసు.ఇంటికెళ్లి ఓ టాబ్లెట్ షీట్ తీసి ఇచ్చాడు.
అది అందుకున్న వారు ఇదేంటి బాబు అని అడగ్గా.ఇది తన పెళ్లి శుభలేఖ అని చెప్పడంతో అవతలి వారు అవాక్కయ్యారు.
దాంతో వారు ఒకటికి రెండు సార్లు చూసుకున్నారు.అలా తేరిపారా చూస్తే కాని తెలియలేదు అది శుభలేఖని.
వివరాల్లోకి వెళితే, వృత్తిరీత్యా ఫార్మసీ రంగానికి చెందిన తిరువణ్ణామలైకి చెందిన ఎళిలరసన్ సెప్టెంబర్ 5వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నాడు.దీనికోసం టాబ్లెట్ సీట్ రూపంలో తన వెడ్డింగ్ కార్డుని కొట్టించాడు.
టాబ్లెట్ పేరుండే చోట ఎళిలరసన్, వసంతకుమారిల విహహం అంటూ ప్రింట్ చేయించాడు.Expire Date ఉన్న చోట పెళ్లి తేదీ, విందు సమయం, రిసప్షన్ ఎప్పుడో ముద్రించాడు.
ఇంకా పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెల విద్యార్హతలు, వారు చేసే పని.ఇలా అన్ని రకాల వివరాలను ఈటాబ్లెట్ కార్డులో ముద్రించి పంచడం మొదలు పెట్టాడు.







