బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో ప్రేక్షకాదరణను సొంతం చేసుకోవడంతో పాటు మంచి రేటింగ్ లను అందుకుంటూ ఉండటంతో ఈ షోను అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ ఇప్పటికే కొంతమంది పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.
అలా ప్రచారంలోకి వచ్చిన పేర్లలో చలాకీ చంటి, మోహన భోగరాజు పేర్లు కూడా ఉన్నాయి.
అయితే ఈ షోలో పాల్గొనడం లేదని మోహన భోగరాజు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.
అయితే చలాకీ చంటి మాత్రం బిగ్ బాస్ షోలో పాల్గొనడం గురించి వెరైటీగా స్పందించారు.సెప్టెంబర్ నెల 4వ తేదీ నుంచి బిగ్ బాస్ షో ప్రసారం కానుంది.
ఇప్పటికే విడుదలైన ప్రోమోలు ఈ షోపై అంచనాలను అంతకంతకూ పెంచుతుండటం గమనార్హం.బుల్లితెర ప్రేక్షకులు బిగ్ బాస్ షో వస్తుందంటే బుల్లితెరకే పరిమితమవుతారనే సంగతి తెలిసిందే.
చలాకీ చంటి మాట్లాడుతూ బిగ్ బాస్ టీమ్ తో దాదాపుగా ఇప్పటికే చర్చలు అయిపోయాయని చెప్పుకొచ్చారు.అయితే రెండు విషయాలు మాత్రం మిగిలిపోయాయని చలాకీ చంటి వెల్లడించారు.
ఆ రెండు విషయాలు తేలితే బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇస్తానని చలాకీ చంటి తెలిపారు.మరి చలాకీ చంటి విధించిన షరతులకు బిగ్ బాస్ బృందం అంగీకరించిందో లేదో తెలియాల్సి ఉంది.

మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పేర్లలో ఎంతమంది బిగ్ బాస్ షోలో ఉంటారో ఎంతమంది కొత్తగా షోలోకి ఎంట్రీ ఇస్తారో తెలియాల్సి ఉంది.బిగ్ బాస్ షోకు నాగార్జునే ఇక పర్మినెంట్ హోస్ట్ అని తెలుస్తోంది.ఇతర హీరోలు ఈ షోపై ఆసక్తి చూపకపోవడం కూడా నాగార్జునే హోస్ట్ గా కొనసాగడానికి కారణమని బోగట్టా.







