సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూట్ త్వరలో మొదలుకానుండగా 2023 సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడదలయ్యే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.
పోకిరి సెంటిమెంట్ కు ప్రాధాన్యతనిస్తూ ఆ తేదీనే మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
అయితే మహేష్ సోదరి మంజుల గురించి కూడా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
నటిగా, నిర్మాతగా మంజుల ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.పరిమితంగా సినిమాలను నిర్మించినా ఆ సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను నచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
అయితే మహేష్ భార్య నమ్రత తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఒక పార్టీలో అనుకోకుండా మంజులను కలిశానని ఆమె వెల్లడించారు.
ఆ సమయంలో నేను మహేష్ బాబుతో ప్రేమలో ఉన్నానని ఆమెకు తెలియదని నమ్రత వెల్లడించారు.ఆ తర్వాత మేము ఒక కుటుంబం అయ్యామని నమ్రత కామెంట్లు చేశారు.
మంజుల నా బెస్ట్ ఫ్రెండ్ అని ఆమె చెప్పుకొచ్చారు.మేమిద్దరం ఒకే సమయంలో ప్రెగ్నెన్సీని ధరించడం యాదృచ్ఛికంగా జరిగిందని ఆమె కామెంట్లు చేశారు.
వాస్తవానికి పిల్లల్ని కనడం మొదట్లో మంజులకు ఇష్టమే లేదని ఆమె చెప్పుకొచ్చారు.కానీ ప్రస్తుతం మంజుల ఒక బిడ్డకు కూతురు అని తల్లిగా మంజుల ఎంతగానో ఆనందిస్తోందని ఆమె చెప్పుకొచ్చారు.మహేష్ బాబు, నమ్రత కలిసి నటిస్తే చూడాలని ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.మహేష్ నమ్రత కలిసి వంశీ సినిమాలో నటించినా ఈ సినిమా సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే.
పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు దూరం కావడంతో నమ్రత అభిమానులు మాత్రం తెగ ఫీలవుతున్నారు.