నితిన్ మాచర్ల నియోజకవర్గం.. ఫైనల్ గా మిగిలింది, తగిలింది ఇంతే!

నితిన్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం లో రూపొందిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం‘.ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుండే అంచనాలు భారీ గా నమోదు అయ్యాయి.

 Nitin Macharla Niyojakavargam Film Final Collections , Film News, Krithi Shetty-TeluguStop.com

నితిన్ మాస్ పాత్ర అవ్వడం తో పాటు కృతి శెట్టి హీరోయిన్ అవ్వడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుంది అంటూ అంతా భావించారు.

తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కాని సినిమా తీవ్రంగా నిరాశ పర్చింది.

ఈమధ్య కాలంలో యావరేజ్‌ టాక్ వచ్చిన సినిమాలను జనాలు కనీసం పట్టించుకుంటున్న దాఖలాలు లేవు.ఓపెనింగ్ రోజు వసూళ్లు తగ్గితే ఆ తర్వాత ఉండటం కష్టమే.

ఇప్పుడు అదే పరిస్థితి కృతి శెట్టికి కనిపిస్తుంది.మాచర్ల నియోజక వర్గం కు వచ్చిన బజ్‌ నేపథ్యం లో ఈ సినిమా ను అన్ని ఏరియాలకు కలిపి దాదాపుగా 24.3 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడం జరిగింది.

సినిమా కు వచ్చిన టాక్‌ నేపథ్యం లో లాంగ్ రన్‌ లో ఈ సినిమా 8 కోట్ల వరకు రాబట్టే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

సినిమా కు బయ్యర్లు దాదాపుగా 15 కోట్ల వరకు నష్టపోవాల్సి రావచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్‌ మీడియా లో మాచర్ల నియోజక వర్గం యొక్క ఫలితం గురించి రకరకాలుగా షికార్లు చేస్తున్నాయి.

నితిన్ కెరీర్‌ లో మరో ప్లాప్ గా ఈ సినిమా నిలువబోతుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్‌ మీడియా లో నితిన్ సినిమా ల ఎంపిక విషయం లో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

నితిన్ సొంత నిర్మాణ సంస్థ అవ్వడం వల్ల కాస్త ఎక్కువగానే ఖర్చు చేశారు.కాని సినిమా మాత్రం రాబట్టింది లేదు.నితిన్ ముందు ముందు సినిమాలు అయినా కమర్షియల్ సక్సెస్‌ లను దక్కించుకుంటాయా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube