మాస్ మహారాజా ఏడాదికి మూడు నాలుగు సినిమాలను పక్కాగా విడుదల చేస్తాడు.ఈయన గ్యాప్ లేకుండా సినిమాలు అనౌన్స్ చేసి అంతే వేగంగా షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నాడు.
ఇటీవలే రమేష్ వర్మ దర్శకత్వంలో చేసిన ఖిలాడీ, ఆ తర్వాత శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామారావు ఆన్ డ్యూటీ‘ సినిమాలు అనుకున్నంత హిట్ అయితే అవ్వలేదు.
ఇక ప్రెజెంట్ రవితేజ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాను కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.అయితే రవితేజ చేసిన వరుస సినిమాలు పరాజయం కావడంతో ఈ సినిమాపైనే ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ రిలీజ్ చేసారు మేకర్స్.ఈ సినిమా నుండి ఈ రోజు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయగా ఈ లిరికల్ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
ఈ పాట మాస్ అండ్ ఎనర్జిటిక్ గా ఉంది.ఇందులో రవితేజ అండ్ శ్రీలీల జంటగా కనిపించగా వీరి జంట ప్రేక్షకులకు కన్నుల విందుగా ఉంది.
ఇలా ఫస్ట్ సింగిల్ తోనే ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించడంలో సక్సెస్ అయ్యింది.

ఇక ఈ సినిమాలో కామెడీ డోస్ ఎక్కువుగానే ఉంది అని సమాచారం.యాక్షన్ తో విసిగిపోయిన ప్రేక్షకులు కామెడీ తో వస్తే అయినా రవితేజ సినిమాను హిట్ చేస్తారేమో చూడాలి.ఈ సినిమాలో రవితేజ కు జోడీగా పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల నటిస్తుండగా.
వివేక్ కూచిభట్ల సహా నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.







