మ‌రోసారి బాబు ఢిల్లీకి..? ఈసారి ఏపీ ప‌రిస్థితులు.. జ‌గ‌న్ పై గ‌ట్టిగానే...!

ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు మారుతున్నాయి.టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి ద‌గ్గ‌ర‌వుతున్నారు.

 Babu To Delhi Again This Time The Conditions Of Ap  Hard On Jagan , Chandra Babu-TeluguStop.com

మొన్నామ‌ధ్య అడ‌క్కుండానే ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు తెలిపారు.ఇక రీసెంట్ గా ఢిల్లీ నుంచి పిలుపు రావ‌డంతో ఫ్లైట్ ఎక్కారు.

అక్క‌డ మోడీ బాబుతో ముచ్చ‌టించార‌నే వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి.ఈ నేప‌థ్యంలోనే మ‌రోసారి ఢిల్లీ బాట పట్టనున్నారా అంటే అవును అనే అంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు.

అయితే ఈ మధ్య ఢిల్లీ రావడం తగ్గించేశారు అంటూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమావేశం సందర్భంగా మోడీ బాబుతో అన్నారని ఓ మీడియా విపరీతంగా ప్రచారం చేసింది.దానికి బ‌లం చేకూరేలా బాబు మరిన్ని ఢిల్లీ టూర్లు వేయ‌నున్నార‌ని అంటున్నారు.

మోడీ షాల‌ను మీట్ అవ్వ‌డానికి

ఇక అతి త్వరలోనే బాబు మరోసారి ఢిల్లీకి వెళ్తార‌నే ప్రచారం జ‌రుగుతోంది.ఈ సారి టూర్ లో బాబు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాను ప్రత్యేకంగా క‌ల‌వ‌నున్నార‌ని అంటున్నారు.

ఈ అపాయింట్ మెంట్స్ కోసమే టీడీపీ ఇపుడు ప్రయత్నాలు చేస్తోంద‌ట‌.అవి కనుక ఖరారు అయితే చంద్రబాబు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేయడం ఖాయమని అంటున్నారు.

ఇక మోడీ కూడా ఈసారి కలుద్దామని చెప్పడంతో కచ్చితంగా ప్రధాని అపాయింట్మెంట్ లభించి తీరుతుంద‌ని టీడీపీ వర్గాలు కూడా బ‌లంగా న‌మ్ముతున్నాయి.కేంద్రంలో బీజేపీకి మిత్రులు కరవు అవుతున్న నేపథ్య‌లో బాబును ద‌గ్గ‌ర చేసుకోవ‌డానికి బీజేపీ కూడా ఇంట్రెస్ట్ గా ఉంద‌ట‌.

Telugu Amith Shah, Ap Cm Jagan, Chandra Babu, Pm Modi-Political

అయితే ఇటీవ‌ల బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్డీఏకు గుడ్ బై చెప్పారు.భారీ షాక్ ఇస్తూ లాలూ ప్ర‌సాద్ తో క‌లిసిపోయి మ‌ళ్లీ సీఎం అయ్యారు.దీంతో మిత్రులను పెంచుకోవాల్సిన ఆవశ్యకత బీజేపీ మీద ఉంది.నితీష్ విపక్షం వైపు రావడంతో అక్కడ బలం పెరుగుతుందని బీజేపీ ఊహిస్తోంది.ఈ క్రమంలో చంద్రబాబు లాంటి రాజకీయ వ్యూహకర్త తమ వైపు ఉంటేనే మేలు అని కూడా కేంద్ర పెద్దలు భావించినా భావించే అవ‌కాశం లేక‌పోలేదు.ఈ నేప‌థ్యంలోనే లెక్క‌లు వేసుకుని బాబు ఢిల్లీ టూర్ ఈసారి పెట్టుకుంటున్నార‌ని సమాచారం.

ఇక బాబు ఢిల్లీ వెళ్లి మోడీషాలను కలిసేది.వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తును కలుపుకొనే యత్నం ఒకటి అయితే అదే టైం లో ఏపీలో జగన్ని బీజేపీకి దూరం చేసేందుకు కూడా వ్యూహ ర‌చ‌న చేస్తున్నార‌ని అంటున్నారు.

ఇక ఏపీలో మూడేళ్ల‌ వైసీపీ సర్కార్ మీద టీడీపీ అనేక ఫిర్యాదులను ఇప్పటికే చేసింది.వాటిని అన్నిటికీ ప్రధాని హోం మంత్రులకు చూపించడం ద్వారా ఏపీ సర్కార్ మీద యాక్షన్ తీసుకోవాలని కోరిన‌ట్లు చెబుతున్నారు.

అలాగే ఏపీలో టీడీపీ కార్యకర్తలు సానుభూతిపరుల మీద అధికార పార్టీ ఆగడాలు పెచ్చుమీరుతున్నాయని శాంతిభద్రతలు కూడా ప్రశార్ధకంగా మారాయని టీడీపీ ఆరోపిస్తూ వస్తోంది.ఇపుడు దాన్ని కూడా కేంద్రానికి ఫిర్యాదు చేయడం ద్వారా జగన్ని ఇరకాటంలో పెట్టాలని బాబు చూస్తున్నార‌ట‌.

మొత్తానికి బాబు ఢిల్లీ టూర్లు వైసీపీని టెన్ష‌న్ పెట్టే విష‌యంగా చెప్ప‌వ‌చ్చు.ఇక ఏ క్ష‌ణ‌మైనా బాబు ఢిల్లీ ప‌య‌న‌మ‌వుతార‌ని అంటున్నారు.

మ‌రి అపాయింట్ మెంట్ దొరుకుతుందో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube