జమ్ముకాశ్మీర్ లో ఘోర ప్రమాదం జరిగింది.పహల్గామ్ లోని చందన్ వాడీ సమీపంలో ఐటీబీపీ జవాన్లతో వెళ్తున్న బస్సు నదిలో పడింది.
ఈ ప్రమాదంలో ఆరుగురు జవాన్లు మృతిచెందగా, మరో 32 మంది గాయపడ్డారు.ఘటన జరిగే సమయంలో బస్సులో 39 మంది ఉన్నారని తెలుస్తోంది.
అందులో 37 మంది ఐటీబీపీకి చెందిన వారని, ఇద్దరు జమ్మూకశ్మీర్ పోలీసులకు చెందిన వారని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు తెలిపారు. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగిందని వెల్లడించారు.







