వాయమ్మో.. ప్రభాస్ పెళ్లి చేసుకుంటే ఉదయ్ కిరణ్ పరిస్థితి ఎదురవుతుందా?

టాలీవుడ్ లో ప్రస్తుతం బాలీవుడ్ హీరోలకు ఉన్నంత క్రేజ్ అందుకుంటూ ఓ రేంజ్ లో దూసుకుపోతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

 Astrologer Venu Swamy Prediction Prabhas Marriage Viral,astrologer Venu Swamy,pr-TeluguStop.com

వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బాగా బిజీగా మారాడు.చాలా వరకు మంచి మంచి హిట్ లను అందుకున్నాడు ప్రభాస్.

టాలీవుడ్ ఇండస్ట్రీకి 2002లో ఈశ్వర్ సినిమాతో అడుగు పెట్టాడు.ఆ తర్వాత రాఘవేంద్ర, వర్షం వంటి పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు అందుకున్నాడు.ఇక ఈ సినిమాలతో మంచి హిట్ సొంతం చేసుకున్నాడు.అలా పలు సినిమాలలో నటించాక పాన్ ఇండియా మూవీ బాహుబలి సినిమాతో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నాడు.

ఈ సినిమా తర్వాత మొత్తం పాన్ ఇండియా సినిమాలకే అలవాటు పడుతున్నాడు ప్రభాస్.అంతేకాకుండా దర్శకులు కూడా ప్రభాస్ కోసం పాన్ ఇండియా సినిమాలనే తెస్తున్నారు.

ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలతోనే బిజీగా ఉన్నాడు.ఇక సినిమాల వరకు అంత బాగానే ఉంది కానీ ఆయన పెళ్లి చేసుకుని సెటిల్ అవడం ఒకటే బ్యాలెన్స్ ఉంది.

Telugu Astrologervenu, Astrology, Baahubali, Prabhas, Tollywood, Uday Kiran-Movi

ఇక ఆయన అభిమానులు కూడా తన పెళ్లి గురించే చింతిస్తున్నారు.ఇప్పటికే ప్రభాస్ కు ఎన్నో సార్లు తన పెళ్లి గురించి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి.కానీ ప్రభాస్ ఎప్పుడు ఏదో ఒక విషయం చెబుతూ తప్పించుకుంటాడు.ఈయన అభిమానులే కాకుండా ఈయన కుటుంబ సభ్యులు కూడా ఈయన పెళ్లి విషయంలో చాలా బాధపడుతున్నారు.

ప్రభాస్ ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అని ఇంకెంత కాలం ఆయనను అలా సింగిల్ గా చూడాలి అని అనుకుంటున్నారు.కానీ ఇప్పుడు ఒక వార్త తెలియటంతో ఆయనకు పెళ్లి కాకపోవడమే బెటర్ అని అనుకుంటున్నారు.

అదేంటి ఇంతకాలం ఆయన పెళ్లి కోసం ఎదురుచూసిన వాళ్ళు ఇప్పుడు పెళ్లి వద్దంటున్నారు ఏంటి అని అనుకుంటున్నారా.

Telugu Astrologervenu, Astrology, Baahubali, Prabhas, Tollywood, Uday Kiran-Movi

అవును.ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు ఆయనకు పెళ్లి చేయకపోవటమే బెటర్ అని అంటున్నారు.ఇంతకు అసలు విషయం ఏంటంటే.

ప్రభాస్ పెళ్లి చేసుకుంటే ఆయన పరిస్థితి ఉదయ్ కిరణ్ పరిస్థితి లా అవుతుంది అని ఒక వార్త నెట్టింట బాగా వైరల్ అవుతుంది.ఉదయ్ కిరణ్ కూడా మంచి హోదాలో ఉన్న సమయంలో పెళ్లి చేసుకోగా ఆ తర్వాత ఆయన కొన్ని కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

దీంతో ప్రభాస్ కి కూడా ఇదే పరిస్థితి వస్తుంది అని.ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గతంలో చెప్పడంతో ప్రస్తుతం ఈ విషయం బాగా వైరల్ అవుతుంది.ఇప్పటికే ఈయన పలువురు సెలబ్రెటీల విషయంలో చెప్పినవన్నీ నిజం కావడంతో ప్రభాస్ జీవితంలో కూడా అలాగే జరుగుతుంది అని భయపడి ప్రభాస్ కు పెళ్లి వద్దంటున్నారు అభిమానులు.మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి అంటే ఆయన పెళ్లి తర్వాతే తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube