పొత్తులు .. ఫిర్యాదులు : మళ్లీ ఢిల్లీ టూర్ కి బాబు !

టిడిపి చంద్రబాబు మరోసారి హస్తినబాట పట్టబో తున్నారు.కొద్దిరోజుల క్రితమే ఆజాధిక అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ తో భేటీ అయ్యారు.

 Tdp Chandrababu Naidu Going To Complaint On Ycp Govt And Discuss Alliance With B-TeluguStop.com

నరేంద్ర మోదీతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడింది కొద్ది నిముషాలే అయినా,  ఏపీలో మాత్రం టిడిపి, బిజెపిలు పొత్తు పెట్టుకోబోతున్నాయి అనే ప్రచారానికి వూతం కలిగించాయి.

దీనికి తగ్గట్టుగానే గతంలో చంద్రబాబును కలిసేందుకు కానీ,  పలకరించేందుకు కానీ ఇష్టపడని బిజెపి అగ్ర నేతలు ఇప్పుడు ఆ విషయం లో తమ వైఖరిని మార్చుకోవడంతో, టిడిపిలోను ఉత్సాహం కనిపిస్తోంది.ఎన్నికల సమయం నాటికి తప్పకుండా బిజెపి తమతో కలిసి వస్తుందని బలంగా నమ్ముతోంది.

ఈ క్రమంలోనే మరోసారి ఢిల్లీకి వెళ్ళేందుకు టిడిపి అధినేత చంద్రబాబు ప్లాన్ చేసుకుంటున్నారు.వారం రోజుల్లో ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.ఇప్పటికే బీజేపీ కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.వారి అపాయింట్మెంట్ దొరకగానే ఢిల్లీకి వెళ్లి వైసిపి ప్రభుత్వంపై ఫిర్యాదు చేయాలని డిసైడ్ అయ్యారట.

ఏపీ ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తోందని, కేంద్రం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను తమవిగా చెప్పుకుంటూ లబ్ధి పొందుతోందని, టిడిపి నేతలపై అక్రమంగా కేసులు బనాయిస్తూ, అరెస్టులు చేయిస్తోంది అని, ఇలా అనేక అంశాలపై వైసిపి ప్రభుత్వం పై ఫిర్యాదు చేయాలని బాబు డిసైడ్ అయ్యారట.

Telugu Amith Sha, Ap, Chandrababu, Jagan, Janasenani, Modhi, Pavan Kalyan, Telug

పనిలో పనిగా టిడిపి, బిజెపి ల పొత్తు అంశం పైన చర్చించాలని నిర్ణయించుకున్నారట.ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే కేంద్రం మద్దతు అత్యవసరమని, టిడిపి శ్రేణుల్లోనూ ఉత్సాహం పెరగాలంటే బిజెపి అండదండలు ఉంటేనే అది సాధ్యమని లెక్కలు బాబు ఉండడంతోనే ఇప్పుడు ఢిల్లీ నుంచి ఏ ఆహ్వానం అందకపోయినా పనిగట్టుకుని బిజెపి అగ్ర నేతలను ప్రసన్నం చేసుకునేందుకు చంద్రబాబు శ్రీకారం చుట్టినట్లుగా అర్థమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube