టీడీపీ అన్ని ర‌కాలుగా బ‌లంగా ఉన్నా.. ఇంకా ఎక్క‌డో వెలితి.!!

అన్న‌గారు ఎన్టీరామారావు స్థాపించిన పార్టీ.ఎన్నో ఎన్నిక‌ల‌ను చూసిన పార్టీ.

 Even Though Tdp Is Strong In All Ways It Still Comes Out Somewhere Details, Chan-TeluguStop.com

ఎన్నో సార్లు అధికారం చేప‌ట్టిన పార్టీ.ఎంతో ఘ‌న చ‌రిత్ర క‌లిగిన పార్టీ టీడీపీ.

బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉన్న పార్టీ.లెక్క‌కు మించి సీనియ‌ర్లు ఉన్న పార్టీ.

అన్ని రకాలుగా అన్నీ ఉన్న పార్టీ.కానీ ప్ర‌స్తుతం కొత్త‌ద‌నం లేద‌నే వాద‌న వినిపిస్తోంది.

ఓల్డ్ నేత‌ల‌తో నిండిపోయి అప్డేడ్ అవ‌డం లేద‌ని అంటున్నారు.యంగ్ బ్ల‌డ్ తో పార్టీ క‌ళ‌క‌ళ‌లాడ‌టం లేద‌ని అంటున్నారు.

టీడీపీ అంటేనే సీనియర్ల పార్టీగా మరో ముద్ర పడిపోయింది.ఇక చంద్రబాబు నాయుడు 1995లో సీఎం అయ్యారు.

నాటికి బాబు వయసు నాలుగున్నర పదులు దాటింది.అంటే యువ ముఖ్యమంత్రిగా అంతా చూసేవారు.

యువకుడిగా అప్పట్లో బాబు మంత్రివర్గం ఉండేది.అయితే అనేక జనరేషన్స్ మారాయి కానీ బాబుతో పాటు ఆయన టీమ్ మాత్రం మారలేద‌ని అంటున్నారు.

టీడీపీ వస్తే ఎవరు సీఎం అవుతారు అంటే మళ్లీ చంద్రబాబే.దీంతో కొత్త‌గా ఏముంటుంద‌ని జ‌నాలు ఫీల‌వుతున్నార‌ని అంటున్నారు.

కొత్త‌ద‌నం కోరుకుంటున్నారు.

ఎంత సీనియ‌ర్ అయినా.ఎంతో అనుభవం ఉన్నా… ప‌రిస్థితులు.కాలానికి అనుగుణంగా కొత్త‌ద‌నం లేక‌పోతే కొత్త‌గా మారేదేముంద‌నే భావ‌న క‌లుగుతోంద‌ట‌.టీడీపీలో బాబు తరువాత తరం గట్టిగా పుంజుకోలేదు.కనీసం కొడుకు లోకేష్ అయినా అంది వస్తే ఆయన మీద మోజు పెరిగేది.

బాబు పాలన చూశాం లోకేష్ ఎలా పాలిస్తారో అన్న ఉత్కంఠ పెరిగేది.కానీ అదీ జ‌ర‌గ‌లేదు.

ఇక మళ్లీ చంద్రబాబేనా అంటేనే జనాలలో పెద్దగా ఆస‌క్తి పెంచ‌లేక‌పోతున్నారు.టీడీకీ అన్నీ ఉన్నాయి.

ఏ పార్టీకి లేనంత ఐక్యత, సామాజికవర్గం బలం ఆ పార్టీ సొంతం.అలాగే అనుకూల మీడియా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది.

ఇక వ్యూహాలలో బాబు దిట్ట.ఢిల్లీ లెవెల్ లో ఏ పార్టీ ఉన్నా బాబుకు అధికారం లేకపోయినా ఆయన హవాయే సాగుతోంది.

అలాగే కీలక వ్యవస్థలలో టీడీపీకి మద్దతు ఉందని చెబుతారు.ఇలా అన్నీ ఉన్నా కూడా జనాల్లో మాత్రం అనుకున్న స్థాయిలో ఆదరణ రావడంలేదంటున్నారు.

Telugu Ap, Chandra Babu, Jagan, Lokesh, Pawan Kalyan, Seniors, Tdp Senior, Young

నిజానికి ఏపీలో జగన్ పాలన ఏంటో తెలిసిపోయింది.జగన్ అనుభవ రాహిత్యం చాలా విషయాల్లో క్లియర్ గా కనిపిస్తోంది.అభివృద్ధి అన్న మాట లేదు.అప్పుల కుప్పగా ఏపీ త‌యారైంది.అయిత‌నా కూడా మూడున్నరేళ్ల‌ పాలనకు జగన్ దగ్గర పడుతున్నా వైసీపీని దాటి టీడీపీ ముందుకు వెళ్లలేక‌పోతోంది.ఇటీవ‌ల ఇండియా టీవీ, ఇండియా టుడే సర్వేల్లో ఏపీలో మళ్లీ వైసీపీ జెండానే ఎగురుతుంద‌నే నివేద‌లు ఇచ్చాయి.

అంటే జగన్ జనాధ‌రణ బాగుందని అనుకోవాలా.లేక సరైన ప్ర‌త్య‌ర్థి లేడ‌ని అనుకోవాలో తెలియ‌డం లేదు.

ఇక జగన్ ఏజ్ తో మ్యాచ్ అయ్యే పవన్ కళ్యాణ్ కనుక పుంజుకుంటే జగన్ కి అక్కడ నుంచి భారీ పోటీ వస్తుందేమో చూడాలి.పవన్ నిలకడగా రాజకీయం చేసే కచ్చితంగా జగన్ కి గట్టి పోటీదారు అయి తీరుతారు అని చెప్పవచ్చు.

కానీ టీడీపీ అయితే మాత్రం ఈ రోజుకీ అనుకున్న తీరున గ్రాఫ్ పెంచుకోలేకపోవడానికి పార్టీ పరమైన ఇబ్బందులే ప్రధాన సమస్య అని అంటున్నారు.

Telugu Ap, Chandra Babu, Jagan, Lokesh, Pawan Kalyan, Seniors, Tdp Senior, Young

అయితే టీడీపీ విష‌యంలో ఎంత చేసినా అనుకున్న హైప్ తీసుకురాలేకపోతున్నారు.ఎన్నిక‌లు మ‌రో ఏడాదిన్న‌ర కాలంలో జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఇంకా టీడీపికి పాజిటివ్ వాతావరణం రావడం లేదంటున్నారు.దీన్ని బ‌ట్టి చూస్తే పార్టీలో యంగ్ బ్ల‌డ్ నింపాల్సిన అవ‌స‌రం ఉంది.

ఇప్ప‌టికే పార్ట‌లో న‌ల‌బై శాతం యంగ‌ర్స్ కే టికెట్స్ ఇస్తామ‌ని చెప్పిన‌ప్ప‌టికీ అది ఎంతమేర అమ‌ల‌వుతుందో చూడాలి.అలాగే అధినాయ‌క‌త్వం కూడా యంగ్ లుక్ తో ఉంటే పార్టీకి కొత్త ఊపు వ‌స్తుంద‌ని అంటున్నారు.

మొత్తానికి టీడీపీలో కొత్త‌ర‌క్తం ప్ర‌వ‌హిస్తే గానీ.ప‌రిస్థితి మెరుగు అయ్యేలా లేదు.

మ‌రి దీనికి చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube