యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీలో వైట్‌హౌస్ తాత్కాలిక సమన్వయకర్తగా అమిత్ జానీని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నియమించారు.అమిత్ .
బైడెన్ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి జాతీయ ఆసియా, అమెరికన్ పసిఫిక్ ఐలాండర్ (ఏఏపీఐ) డైరెక్టర్‌గా చేశారు.అలాగే న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్పీ… సెనేటర్ బాబ్ మెనెండెజ్ వంటి పలువురు చట్టసభ సభ్యులతో కలిసి పనిచేశారు.
హోంలాండ్ సెక్యూరిటీలో ఇటీవల పదవికి ముందు పెంటగాన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ యాక్షన్ గ్రూప్ డైరెక్టర్‌గా కూడా వున్నారు.జానీ 2019లో ఏఏపీఐ జాతీయ డైరెక్టర్‌గా బైడెన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఇందుకోసం న్యూజెర్సీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో శాసన అనుసంధానకర్తగా తన పదవిని విడిచిపెట్టారు.
జెర్సీ సిటీ నివాసిగా జానీ తన పొలిటికల్ కన్సల్టింగ్ సంస్థ అయిన విజన్ మీడియా మార్కెటింగ్‌కి అకౌంట్ ఎగ్జిక్యూటివ్‌గా కూడా పనిచేశారు.యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు ఫ్రాంక్ పల్లోన్ జూనియర్‌కి సహాయకుడిగా, హడ్సన్ కౌంటీ స్కూల్స్ ఆఫ్ టెక్నాలజీ బోర్డు ఆఫ్ ఎడ్యుకేషన్‌లో సభ్యుడిగానూ విధులు నిర్వర్తించారు.2017లో ఫిల్ మర్ఫీ గవర్నటోరియల్ ప్రచారానికి జానీ ఏఏపీఐ ఔట్‌రీచ్‌కి డైరెక్టర్‌గా మారారు.2018లో యూఎస్ సెనేటర్ జాబ్ మెనెండెజ్ ఎన్నికల ప్రచారంలోనూ కీలకపాత్ర పోషించారు.
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కి చెందిన అమిత్ జానీ సంవత్సరం పిల్లాడిగా వున్నప్పుడు తన తల్లితో కలిసి అమెరికా గడ్డ మీదకు అడుగుపెట్టారు.ఎన్నో ఏళ్లుగా అమిత్ జానీ న్యూజెర్సీలో నివసిస్తున్నాడు.అమెరికాలో భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన రాష్ట్రాల్లో న్యూజెర్సీ కూడా ఒకటి.
అమిత్ జానీ తండ్రి దివంగత సురేష్ జానీ సైతం భారతీయ అమెరికన్ వలసదారుల కోసం వాదించేవారు.అమిత్ తల్లి దీప్తి జానీ వ్యాపారవేత్త.న్యూజెర్సీ, న్యూయార్క్‌లలో డెలి, కన్వీనియన్స్ స్టోర్స్‌ను ఆమె నిర్వహిస్తున్నారు.