కుటుంబ స్వార్థం కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని టీఆర్ఎస్ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని ఆయన ఆరోపించారు.
అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని విమర్శించారు.దేశ ద్రోహానికి పాల్పడుతున్న బీజేపీ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు.
సామాన్యులపై పెను భారం మోపే విధంగా పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.అనంతరం మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీనే విజయం సాధిస్తుందని మంత్రి జగదీశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.







